రవి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో నిశ్శబ్దం అలానే ఉంది.
నరేంద్ర మాత్రం అతని మాటలనే ఆలోచిస్తున్నాడు.
“మీ కుటుంబాల్లోనే కొందరు మీ పెళ్లిని ఆపడానికి సిద్ధంగా ఉన్నారు.”
ఆ మాట ప్రణిత మనసులో కూడా తిరుగుతూనే ఉంది.
కానీ ఆమె మాత్రం నరేంద్ర ముందు తన భయాన్ని చూపించలేదు.
“నరేంద్ర…”
“హ్మ్?”
“మన పెళ్లిని ఎవరో ఆపాలని చూస్తున్నారని భయపడాల్సినంత విషయం ఏమీ లేదనుకుంటున్నా.”
నరేంద్ర ఆమె వైపు చూశాడు.
“నువ్వు భయపడుతున్నావా?”
“లేదు.”
“నిజం చెప్పు.”