New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 32

♥️బావ మరదలు♥️ – 32

దట్టమైన పొగలు కక్కుతున్న ఇంజిన్ రూమ్, మరోవైపు వేగంగా సుడిగుండం వైపు కొట్టుకుపోతున్న హౌస్ బోట్. అలప్పి బ్యాక్ వాటర్స్ మధ్యలో కటిక చీకట్లో చిక్కుకున్న శివ, సాహిత్యలకు ఇప్పుడు ప్రాణ సంకటం ఎదురైంది. బోట్ డ్రైవర్ స్పృహ తప్పి పడి ఉండటంతో, పడవను కంట్రోల్ చేసే నాథుడే లేడు.

“బావా! పడవ మునిగిపోతోంది బావా.. చుట్టూ అంతా చీకటి, నాకు భయమేస్తోంది!” అంటూ సాహిత్య తన శారీ కొంగును గట్టిగా పట్టుకుని వణికిపోయింది.

శివ ఒక్క క్షణం కూడా కంగారు పడలేదు. అతను బిటెక్ చదివిన రోజుల్లో మెకానికల్ ఇంజనీరింగ్ క్లాసులు బుర్రలోకి తెచ్చుకున్నాడు. “సాహిత్యా! నువ్వు ధైర్యంగా ఉండు. డ్రైవర్ సీటు దగ్గర ఉన్న ఆ పెద్ద ‘స్టేరింగ్ వీల్’  ని గట్టిగా పట్టుకో. పడవను కుడివైపు తిప్పడానికి ప్రయత్నించు. నేను ఇంజిన్ రూమ్‌లోకి వెళ్లి గొలుసును కట్ చేస్తాను” అని అరిచాడు.

శివ వేగంగా ఇంజిన్ రూమ్‌లోకి దూకాడు. అక్కడ విపరీతమైన వేడి, దట్టమైన పొగలు ఉన్నాయి. సరిగ్గా చూస్తే, పడవ ప్రొపెల్లర్ షాఫ్ట్‌కు ఒక లావుపాటి ఇనుప గొలుసు చుట్టేసి ఉంది. ఆ గొలుసు వల్ల మోటార్ జామ్ అయిపోయి కాలిపోతోంది. శివ పక్కనే ఉన్న ఒక ఇనుప గొడ్డలిని అందుకుని, ఆ గొలుసు లింకుల మీద గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. ‘ఠాణ్.. ఠాణ్..’ మనే శబ్దాలతో ఇనుప స్పార్క్స్ వస్తున్నాయి.

 

 

అదే సమయంలో పై డెక్ మీద ఉన్న సాహిత్యకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. సుడిగుండం కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది. నీళ్లు భయంకరమైన శబ్దంతో తిరుగుతున్నాయి. పడవ చక్రం  చాలా బరువుగా ఉండటంతో, సాహిత్య ఒక్కతే దాన్ని తిప్పలేకపోతోంది. ఎంత బలం ఉపయోగించినా చక్రం మొండికేస్తోంది.

“బావా! చక్రం కదలడం లేదు.. సుడిగుండం చాలా దగ్గరకు వచ్చేసింది!” అని సాహిత్య గట్టిగా కేకలు వేసింది.

ఆమెకు ఆ సమయంలో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన బుర్రను ఈసారి ప్రాణాలు కాపాడుకోవడానికి వాడాలనుకుంది. సాహిత్య వెంటనే తను కట్టుకున్న ఆ పొడవైన కేరళ కసవు చీర కొంగును నడుము నుండి విప్పేసింది. ఆ పట్టుచీర కొంగును గట్టిగా ముడి వేసి, ఆ కట్టను డ్రైవింగ్ చక్రానికి ఒక వైపున గట్టిగా చుట్టింది. ఆ తర్వాత ఆ పట్టు బట్టను తన రెండు చేతులతో పట్టుకుని, వెనక్కి దిగి, తన పూర్తి శరీర బరువును ఉపయోగించి తాడులా గట్టిగా లాగింది!

ఆ ‘చీర కొంగు’ సాహసానికి ఆ బరువైన చక్రం మెల్లగా తిరగడం మొదలుపెట్టింది. పడవ దిశ కొద్దిగా మారి, సుడిగుండం అంచు నుండి పక్కకు తప్పుకుంది

 

సరిగ్గా అదే క్షణంలో కింద ఇంజిన్ రూమ్ లో శివ దెబ్బకు ఇనుప గొలుసు విరిగి ముక్కలై కింద పడింది. మోటార్ ఒక్కసారిగా ఫ్రీ అయింది. శివ వెంటనే మెయిన్ స్టార్టర్ లివర్‌ను గట్టిగా పైకి లాగాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue