ఎడారి తుఫాను గండం నుండి క్షేమంగా బయటపడి, హోటల్‌కు చేరుకున్న శివ, సాహిత్యలు సాయంత్రం జరగబోయే దుబాయ్ క్లయింట్ మీటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఎడారిలో తన కుట్ర బయటపడిపోవడంతో ఏంజెలీనా పూర్తిగా భయపడిపోయింది. శివ దగ్గర ఉన్న సీసీటీవీ వీడియో సాక్ష్యం వల్ల ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది.
సాయంత్రం ఏడు గంటలకు దుబాయ్‌లోని ఒక అత్యంత విలాసవంతమైన బిజినెస్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ప్రారంభమైంది. దుబాయ్‌కు చెందిన పెద్ద షేక్ ‘అల్-మక్తూమ్ తన బృందంతో కలిసి వచ్చాడు. వందల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ డీల్ అది. ఆ డీల్ ఓకే అయితేనే ఏంజెలీనాకు యూఎస్ హెడ్ ఆఫీస్‌లో ప్రమోషన్ వస్తుంది.
ఏంజెలీనా తన బిజినెస్ సూట్ వేసుకుని చాలా గంభీరంగా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది. శివ పక్కనే ప్రాజెక్ట్ హెడ్‌గా కూర్చున్నాడు. ఇక సాహిత్య… ఈరోజు ఒక స్టైలిష్ ఇండో-వెస్టర్న్ డ్రెస్ వేసుకుని, చేతిలో ఒక అందమైన బంగారు రంగు డబ్బా పట్టుకుని మీటింగ్ హాల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
“హలో షేక్ గారూ! వెల్కమ్ టు అవర్ మీటింగ్. నేను మిస్టర్ శివ వైఫ్ ని. మా ఇండియన్ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం లేదా బిజినెస్ డీల్ మొదలుపెట్టే ముందు తీపి తినిపించడం ఆచారం. అందుకే మీ అందరి కోసం దుబాయ్ స్పెషల్ ‘స్టఫ్డ్ ఖర్జూరాలు’ తెచ్చాను” అంది సాహిత్య ఇంగ్లీష్‌లో చాలా ముద్దుగా నవ్వుతూ
షేక్ అల్-మక్తూమ్ సాహిత్య మర్యాదకు మురిసిపోయాడు. “వండర్ఫుల్! ఇండియన్ కల్చర్ ఈజ్ గ్రేట్!” అంటూ ఒక ఖర్జూరం తీసుకుని తిన్నాడు. అది చాలా తియ్యగా, బాదం పప్పుతో అద్భుతంగా ఉంది. శివ కూడా ఒకటి తిన్నాడు, అది కూడా సూపర్ గా ఉంది.
ఇక ఆఖరిగా సాహిత్య ఆ డబ్బాను ఏంజెలీనా దగ్గరకు తీసుకెళ్లింది.
“ఇదిగోండి ఏంజెలీనా మేడమ్! మీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ ఖర్జూరం. ఇది తింటే మీ ప్రెజెంటేషన్ అదిరిపోతుంది!” అంది కన్నుగీటుతూ గుసగుసగా.
ఏంజెలీనా అనుమానంగా చూసింది. కానీ షేక్ అల్-మక్తూమ్, క్లయింట్లు అందరూ చూస్తుండటంతో తినకపోతే అగౌరవంగా ఉంటుందని భావించి, ఆ ఖర్జూరాన్ని నోట్లో వేసుకుని కొరికింది.
అంతే! ఆ ఖర్జూరం లోపల బాదం పప్పుకు బదులు సాహిత్య ఏం పెట్టిందో తెలుసా?
ఎడారిలో దొరికే అత్యంత చేదైన ఒక ఆయుర్వేద గింజ పేస్ట్, దానికి తోడు హోటల్ కిచెన్ నుండి తెచ్చిన విపరీతమైన ఉప్పు మరియు పచ్చి వెల్లుల్లి పేస్ట్!