New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 39

♥️బావ మరదలు♥️ – 39

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు రాగానే బంగారు రంగు ఎండ, ఆకాశాన్ని తాకే భవనాలు శివ, సాహిత్యలను ఆకట్టుకున్నాయి. ఫ్లైట్‌లో బురఖా వేషంలో వచ్చి తన ప్లాన్ మొత్తాన్ని తలకిందులు చేసిన సాహిత్యను చూసి ఏంజెలీనా కళ్లల్లో నిప్పులు చెరుగుతున్నాయి. కానీ,  సీఈఓ హోదాలో ఉండటంతో బహిరంగంగా గొడవ పడలేక, పళ్లు కొరుకుతూ కారు ఎక్కింది.

“సాహిత్యా! నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో నాకు తెలియదు కానీ, ఇది కంపెనీ బిజినెస్ ట్రిప్. ఇక్కడ నీ అల్లరి ఆటలు సాగవు. మేము బుక్ చేసిన ఫైవ్ స్టార్ హోటల్‌లో కేవలం మా ఇద్దరికీ మాత్రమే రూమ్స్ ఉన్నాయి” అంది ఏంజెలీనా కారులో కూర్చుంటూ కటువుగా.

“అయ్యో ఏంజెలీనా మేడమ్! నా మొగుడు ఉన్న రూమ్‌లో నాకు సగం వాటా ఎప్పుడూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, నేను మీకు అస్సలు డిస్టర్బెన్స్ ఇవ్వను… కేవలం మా బావకు మాత్రమే డిస్టర్బ్ చేస్తాను!” అంటూ సాహిత్య శివ భుజం మీద తల పెట్టుకుని కన్నుగీటింది. శివ నవ్వు ఆపుకుంటూ బయట కనిపిస్తున్న బుర్జ్ ఖలీఫా వైపు చూశాడు.

కారు దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన ‘అట్లాంటిస్ ది పామ్’ ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది. హోటల్ లాబీ అంతా బంగారు వర్ణంతో, పెద్ద పెద్ద అక్వేరియంలతో ఒక రాజభవనంలా మెరిసిపోతోంది.

 

 

ఏంజెలీనా రిసెప్షన్ దగ్గరకు వెళ్లి, “హలో! నేను కంపెనీ సీఈఓ ఏంజెలీనా. మా కోసం బుక్ చేసిన రెండు ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్ కీస్ ఇవ్వండి” అని అడిగింది.

రిసెప్షనిస్ట్ కంప్యూటర్ చెక్ చేసి, “వెల్కమ్ మేడమ్! మీ కోసం రూమ్ నంబర్ 501, మిస్టర్ శివ కోసం రూమ్ నంబర్ 502 కేటాయించాము. ఇవి రెండూ పక్కపక్కనే ఉండే కనెక్టింగ్ రూమ్స్ అని చెప్పి కీ కార్డులు అందించింది.

ఆ మాట వినగానే ఏంజెలీనా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఎందుకంటే కనెక్టింగ్ రూమ్స్ అంటే లోపల నుండి రెండు గదుల మధ్య ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. రాత్రి పూట శివ రూమ్‌లోకి ఈజీగా వెళ్లొచ్చని ఆమె ప్లాన్!

 

కానీ, సాహిత్య ఆ రిసెప్షనిస్ట్ మాటలు వినగానే తన చురుకైన బుర్రకు పని చెప్పింది. ఏంజెలీనా, శివ లగేజీ చెకింగ్ కోసం పక్కకు వెళ్లిన సమయంలో… సాహిత్య నెమ్మదిగా రిసెప్షన్ దగ్గరకు వెళ్లింది.

తన బ్యాగులోంచి ఇండియన్ కరెన్సీ కాదు, విక్రమ్ ముందే ఇచ్చి పంపిన దుబాయ్ దిర్హామ్స్ నోట్ల కట్టను రిసెప్షనిస్ట్ టేబుల్ కింద నుండి అందించింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue