వలపు మధురిమ ❤️ విరాన్ష్ ❤️ గాయత్రి
ఎపిసోడ్ 14 – ఒకే రక్తం… రెండు జీవితాలు! 💥
గాయత్రి తండ్రి మాట పూర్తి చేయలేక తలదించుకున్నాడు.
విరాన్ష్ అతని వైపు కోపంగా చూస్తున్నాడు.
విరాన్ష్: ఏం తప్పు చేశారు మీరు? అసలు నా జీవితంలో ఏం జరిగింది? నాకు తెలియకుండా ఇన్నాళ్లూ ఏం దాచిపెట్టారు?
గాయత్రి తండ్రి: నీకు నిజం చెప్పే సమయం వచ్చేసింది విరాన్ష్. కానీ ఆ నిజం విన్న తర్వాత నువ్వు నన్ను క్షమించగలవో లేదో నాకు తెలియదు.
విక్రమ్: నాన్నా! ప్లీజ్… ఇంకొక్కసారి ఆలోచించండి. ఆ నిజం బయటపడితే మన కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది.
గాయత్రి తండ్రి: కుటుంబమా? ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్ విక్రమ్? ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేసి మనం కట్టుకున్నది కుటుంబం కాదు… అది అబద్ధాల పునాది!
విక్రమ్: మీరు చేసిన తప్పులన్నీ నా మీదకు నెట్టకండి నాన్నా!
విరాన్ష్: ఆపండి! మీ ఇద్దరి మధ్య గొడవలు తర్వాత చూసుకోండి. ముందు నాకు సమాధానం చెప్పండి. నా తల్లి ఎవరు?
గాయత్రి తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయి.
గాయత్రి తండ్రి: నీ తల్లి పేరు సావిత్రి. చాలా మంచిది. నిన్ను కడుపులో పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నో కలలు కనేది. కానీ నువ్వు పుట్టిన తర్వాత జరిగిన ఒక సంఘటన మా అందరి జీవితాలను మార్చేసింది.