బావతో చిలిపి సరసం
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్… బయట ఏడుస్తూ ఆందోళనగా కూర్చొని ఉంది పద్మావతి. "ఎక్స్క్యూజ్ మీ! ఇక్కడ పేషెంట్ తరపు మనిషి ఎవరు?" అని ఒక నర్స్ వచ్చి అడగగానే, పద్మావతి భయంగా తలెత్తి చూస్తూ, "నేనేనండి, ఆయనకు ఎలా ఉంది?" అని అడుగుతుంటే, "అర్జెంట్ గా ఈ మెడిసిన్స్ కావాలి" అంటూ ఒక స్లిప్ ఇచ్చి వెళ్ళింది నర్స్. తనకా చదువు రాదు; మరి మెడిసిన్స్ ఎలా? అసలు ఎన్నో ఫ్లోర్ లో ఉందో, ఏం జరుగుతుందో కూడా ఆమెకు అర్థం కాక తన బటన్ల ఫోన్ తీసి, స్టార్ గుర్తుగా పెట్టుకున్న కూతురి నెంబర్ మీదకి వెళ్లాక పచ్చ బటన్ నొక్కింది పద్మావతి. అటువైపు లిఫ్ట్ చేసిన 22 సంవత్సరాల నిహారిక,…