వాడు అన్నాడని కాదు నువ్వు నిజంగానే కోపంలో ఆలోచించడం లేదు.
చైత్ర అంకుల్ పని మీదే హడావిడిగా పరిగెడుతూ నిన్ను గుద్దింది. దానికి నువ్వు సీరియస్ అయ్యావు అనగానే చురుగ్గా చూశాడు రానా.
బయట మనిషి అయిన తనకి ఉన్న హ్యుమానిటీ ఇంట్లో వాళ్లకు లేదని చైత్ర గురించి బాధపడుతూ ఇక అంతకు మించి డిస్కషన్ ఆ టైంలో కరెక్ట్ కాదని ఉదయ్ సైలెంట్ గా కూర్చుంటే
ప్యాంటు పాకెట్ లో నుంచి సిగర్ బాక్స్ తీస్తూ కారిడార్ ఎడ్జ్ లో ఉన్న విండో దగ్గరకి వెళ్లిన రాణా అప్పుడే ఆటో ఎక్కుతున్న చైత్రను చూస్తూ పెదవుల మధ్య సిగరెట్ నిలిపి లైట్ చేశాడు.