పెళ్ళి కోసం వచ్చిన బంధువులంతా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అక్కడ మిగిలిన అలంకరణలు, ఆగిపోయిన పెళ్లి పనులు చూస్తుంటే జరిగినదంతా నిజమేనా అనిపించేలా ఉంది.
కార్తీక్ కూడా అక్కడే ఉండి పెళ్లి మండపంలో మిగిలిపోయిన పనులన్నీ చూసుకున్నాడు. వచ్చిన బంధువులకు పరిస్థితిని వివరించి, అక్కడి ఏర్పాట్లను సర్దుబాటు చేయించాడు. మనసులో మాత్రం చెల్లెలి గురించే ఆలోచిస్తున్నాడు.
ముకుంద ఎంత సంతోషంగా ఈ పెళ్లి కోసం ఎదురుచూసిందో అతనికి తెలుసు. మురారిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఎన్నో కలలు కనింది. కానీ ఇప్పుడు ఆ కలలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.
అన్ని పనులూ పూర్తయ్యాక కార్తీక్ హాస్పిటల్కు బయలుదేరాడు.
హాస్పిటల్కు చేరుకున్న అతను ముందుగా తన తండ్రి సీతాపతి దగ్గరకు వెళ్లాడు.
ఏంటి నాన్నా… ఆత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగాడు.