New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసులు కలిసిన వేళ❤️ – 14

మనసులు కలిసిన వేళ❤️ – 14

మరుసటి రోజు ఉదయం…

 

కమలాంబ ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపం వెలుగుతోంది. పూజ ముగించుకుని లోపలికి వచ్చిన ఆమె హాల్లోని సోఫాలో కూర్చుంది. కానీ మనసు మాత్రం నిన్న వచ్చిన ఆ అబ్బాయి దగ్గరే ఆగిపోయింది.

 

ఎందుకో అతని మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.

 

మొదటిసారి ఇంటికి వచ్చినా చాలా మర్యాదగా మాట్లాడాడు. తనకు తెలియని మనిషిలా కనిపించినా, అతని మాటల్లో ఎక్కడో ఒక పరిచయం ఉన్నట్టనిపించింది. ముఖ్యంగా తన అన్నయ్య ఇంటి గురించి అడిగినప్పుడు అతని కళ్లలో కనిపించిన ఆసక్తి ఆమెకు ఇంకా గుర్తుంది.

 

ఏమండీ…

 

పక్కనే పేపర్‌ చదువుతున్న జగన్నాథరావు తలెత్తి చూశారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue