ఇక్కడ నిత్విక్ ఇంట్లో కూర్చొని తన చెల్లెలి గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు అసలు ఇది గ్రీషు కి ఇష్టమేనా లేదా బలవంతంగా ఒప్పుకుందా అని ఒక పక్క ప్రణతి జాడ తెలియక ఇంకో పక్క చెల్లి జీవితం అని ఆలోచిస్తూ కూర్చున్న నిత్విక్ దగ్గరికి గ్రీష్మ వచ్చి ఏమి ఆలోచిస్తున్నావ్ అన్నయ్య నా పెళ్ళీ గురించేనా అని బాధ పడుతు అడుగుతది.
అసలు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావ్ గ్రీషు ఏమి చేద్దాం అనుకుంటున్నావు నీకు వాడు అంటే ఇష్టం కదా కాదు కాదు అంత కన్న ఎక్కువ ప్రాణం కదా మరి ఇలా ఎలా రా అని అడుగుతాడు పైగా నువ్వు ఇప్పుడు అని కడుపు వైపు చూస్తూ ఇంకో మాట చెప్పలేక ఆగిపోతాడు ఎందుకు అన్నయ్య ఆగిపోయావు నాకు ఇప్పుడు మూడో నెల అనే కదా నువ్వు అంటుంది…
అని గ్రీష్మ అడగగా ఇంక నిత్విక్ ఏమి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు గ్రీషు ఎందుకు రా ఇలా మరి ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళీ చూపులు పెళ్ళీ అంత మరి నీకు ఒకేనా అని అడుగుతాడు దానికి గ్రీష్మ ఏమి చెప్పకుండా సైలెంట్ గా అలా ఉండేసరికి గ్రీష్మ వైపు చూస్తాడు తను ఎదో లోకంలో ఉండి ఆలోచిస్తూ ఉండడం చుసిన నిత్విక్….
గ్రీష్మ ని కదుపుతూ నిన్నే ఏమి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు అప్పుడు తన ఆలోచనల నుంచి తెరుకుని ఏమో అన్నయ్య ఎలా జరగాలి అని ఉంటే అలా జరిగిద్ది ఇంక నువ్వు ఈ విషయం గురించి ఏమి ఆలోచించకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిద్ది….
అలా వెళ్తున్న గ్రీష్మ వైపే చూస్తూ నాకెందుకో నువ్వు ఇంక ఎదో పిచ్చి ఆలోచనలో ఉన్నవు అనిపిస్తుంది నా భయమే కానీ నిజం అయితే నో అలా జరగదు ఎప్పటికి తను అలాంటి పిచ్చి పని చేయదు అని తనకి తనే సద్ది చెప్పుకుంటాడు..
నిత్విక్ ఎవరికో ఫోన్ చేసి కోపం గా ఇంక వాడి అడ్రెస్స్ తెలియలేదా త్వరగా కనుక్కోండి ఇడియట్స్ వాడు ఎక్కడ ఉన్న ఇంకో రెండు రోజుల్లో నాకు తెలియాలి లేదంటే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు వెతుక్కునే పరిస్థితి వస్తది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు…..