విక్కీ మాటలు విని సోనీ చాలా చిరాగ్గా, కోపంగా విక్కీని చూస్తూ తన చేతుల్ని విసురుగా లాక్కుని వాట్ ద ఫ* ఆ అని అరుస్తూ…చా ఎంత నమ్మించావ్ నువ్వు నన్ను అంటూ తల పట్టుకుని, అసలు నేను ఇదంతా ఎలా చేసాను…
ఇంత గుడ్డిగా నిన్నెలా నమ్మాను…ఛీ ఎంత నమ్మాను నిన్ను…నువ్వు చెప్పిన ప్రతిదీ నిజం అని నమ్మి నీతో అలా కమిట్ అయిపోయాను…బట్ నువ్వేం చేసావ్ నన్ను నీ అవసరానికి వాడుకోడానికి అన్నీ అబద్దాలు చెప్పి మోసం చేసావ్ అంటుంది కోపంగా….
సోనీ కోపంగా ఉండడంతో తనని ఎలా అయిన కూల్ చేసి అక్కడ నుండీ పంపించేయాలనీ సారీ బేబీ.. ఆమ్ సో సారీ నేను నీ దగ్గర మాట్లాడినవన్ని నిజాలే….
నిజంగా నువ్వు నాకు చూడగానే నచ్చేసావ్… నీ ఫిగర్ నన్ను పిచ్చెక్కించేసింది…
సో నిన్ను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఎలా అయిన నీతో మింగల్ అవ్వాలని నాకు పెళ్లయిందనే ఒక్క నిజాన్ని దాచాను అంతే…
బట్ నాకు నువ్వు నచ్చావ్ అన్నది మాత్రం నిజమే ట్రస్ట్ మీ అంటాడు ఎంతో నమ్మకం గా చెప్తూ…