అప్పుడే ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు ఒకాయన ఇంచుమించు రాఘవేంద్ర గారికి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నారు
ఆయన్ని చూసిన రాఘవేంద్ర గారు చిన్న చిరునవ్వు మొహం మీదకి తెచ్చుకొని అతని వైపు చూశారు
ఎలా ఉన్నారు అన్నయ్య అంటూ పలకరించారు రాఘవేంద్ర గారు వచ్చిన వ్యక్తిని
నేను బాగున్నాను రాఘవ ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ అడిగారు భూషణ్ గారు