ఆదర్ష్ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు…. ఇంతలో ఫోన్ మోగింది అది చూసి ఫస్ట్ అక్షిత అనుకోని ఎత్తలేదు…. మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ ఎత్తాడు…. చెప్పు అంకిత….ఒకసారి మీతో మాట్లాడాలి రూమ్ కి వస్తారా….
హా వస్తున్న అని చెప్పి లేచి వెళ్ళాడు…. అక్కడికి వెళ్లేసరికి అంకిత కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది…. తనని చూసి డోర్ క్లోజ్ చేసి ఏంటి అంకిత అన్నాడు….
నాకు కొంచెం భయంగా ఉంది అండి… ఎందుకో తెలియడం లేదు మనసంతా కలవరంగా ఉంది అని చెప్పింది….ఏమైంది రా ఎవరైనా ఏమైనా అన్నారా… ఉహు మరి అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారు అనింది బాధగా….
ఆదర్ష్ కి కూడా చివుక్కు మంది మనసు…. అంకిత చేయి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చున్నాడు…..చూడు అంకిత ఇంక ఈ విషయాన్నీ మనం మార్చలేం….