ఆదర్ష్ అందరిని చూయించి ఆల్బమ్ మూసేసి అంకిత వైపు చూసేసరికి అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంది…. అది చూసి ఆదర్ష్ బాటిల్లో నీళ్లు తీసుకొని మొహం మీద జల్లాడు….
అప్పుడు తేరుకొని ఆదర్ష్ వైపు చూస్తూ ఇప్పుడు ఏమి జరిగింది అనింది…. అంకిత ఫేస్ చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏమైంది ఏమి కాలేదు ఆల్బమ్ చూసావ్ అంతే అన్నాడు నార్మల్ గా….
ఏంటి ఆల్బమా అది ఎంత సేపు ముగ్గురో నలుగురు గురించో చెప్తూ ఉంటే చిన్నది అనుకున్న అంత మంది ఉన్నారు ఏంటి అది ఇల్లా లేకపోతే ఏదైనా కల్యాణ మండపమా ఆ జనాలు ఏందీ ఆ పేర్లు ఎంది నాకు గుర్తు పెట్టుకోవడ్డానికే రెండు రోజులు పట్టేలా ఉంది….
అంకిత ఎక్స్ప్రెషన్స్ కి మాటలకి ఆదర్ష్ కి నవ్వు వస్తున్న ఆపుకుంటూ చాలా చిన్న ఫ్యామిలీ అంకిత మాది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్నాడు…. చింత నాకు తెలీదు కానీ చిన్న అనకు అసలు అంత మంది ఉండాలంటే ఎంత పెద్ద ఇళ్ళు ఉండాలో తెలుసా అనింది…