స్వయంసిద్ధ – చివరి భాగం!
ఉదయం లేవగానే జాహ్నవి కి మొదటగా కనిపించింది ఫోన్ లో తనకు వచ్చిన మెసేజ్!
ఆ మెసేజ్ మేఘనా రెడ్డి నుండి వచ్చింది! పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పింది! అందుకని ఉదయం ప్రజావాణి డిజిటల్ ఆఫీస్ కి వెళ్లకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకుంది జాహ్నవి.
మేఘనా రెడ్డి తన గదిలో కొన్ని ఫొటోలు, పేపర్స్ మరియు కొన్ని ఆధారాలు టేబుల్ పై ఉంచి చూస్తుంది!
ఆ సమయంలో లోపలకు వెళ్ళిన జాహ్నవి ని చూసి, “రా జాహ్నవి! ఈ కేసులో మనకు కావాల్సిన కీలకమైన ఆధారం దొరికింది.” అంటూ చెప్పింది!
“ఏంటి మేడమ్ అది?”
మేఘనా రెడ్డి తన ఒక ఫొటోను ఆమె ముందుకు జరిపారు. ఆ ఫోటో ని తీసుకుంది జాహ్నవి!
“అది సౌమ్య కనిపించకుండా పోయిన రోజు కాలేజీ వెనుక రోడ్డుకు సంబంధించిన పాత సీసీ టీవీ ఫూటేజ్ నుండి కట్ చేసిన ఫోటో!”
“కాలేజీ లో సి సి టీవి లేదని ప్రిన్సిపాల్ చెప్పింది మేడం!”
“కాలేజీ దగ్గర లోని ఒక ప్రైవేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైం లో ఉన్న కెమెరా రికార్డింగ్ అది!”
ఆ ఫోటో లో ఒక బైక్ కనిపిస్తుంది. దాని పక్కనే ప్రశాంత్ నిలబడి ఉన్నాడు.