New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చెలి -1 – 11
నా చెలి -1 Premium 7 min read

నా చెలి -1 – 11

“చెప్తే వినవు కదా సరే తొందరగా ఫినిష్ చేసి నా రూమ్ కి రా “అని బయటికి వచ్చి చూసేసరికి ఎదురుగ రామ్ నిలబడి ” ఆ అమ్మాయి ఉంది కదా పనులు తను చూసుకుంటుంది కదా నువ్వు ఎందుకు మధ్యలో వెళ్లి ఆ పని చేస్తే ఈ పని చేస్తా అంటున్నావ్, మామ్ కీ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు కానీ ఈ అమ్మాయి తో మాత్రం చక్కగా తిరుగుతున్నావు “అని అంటాడు…….

 

 

నందు కీ కోపం వచ్చి ” తనని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు అన్నయ్య కానీ తను చాలా మంచిది నీకంటే మామ్ కంటే డాడ్ కంటే నాకంటే అందరికంటే చాలా మంచిది. నీకు తన గురించి తెలిస్తే నువ్వు ఇంకెప్పుడు తనని ఇలా అనవు, నేను మామ్ కీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటున్నావ్ కరెక్టే ఇవ్వను కూడా నువ్వు అసలు ఎక్సపెక్ట్ చేయకు కానీ ఒక్క విషయం మామ్ గురించి నీకు ఏమాత్రం తెలియదు తను వదిన నీ ఎంత “అని అనేలోపు “నందు నువ్వు మామ్ గురించి నా దగ్గర చెడుగా చెప్పకు నందు నాకు తెలుసు మామ్ ఎలాంటిదో , కరెక్టే నాకు ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలియదు తెలియకుండా అనకూడదు అనను  ఓకే నా “అని సీరియస్ గా చూసి బయటికి వెళ్ళిపోతాడు……

 

 

రామ్ నీ చూసి ” చిన్నప్పుడు నువ్వు వదినతోనే ఉండేవాడివి  ఇప్పుడు ఎందుకు అన్నయ్య ఇలా అయిపోయావు బహుశా అమ్మ ట్రైనింగ్ అయి ఉంటుంది నీకు నువ్వే తెలుసుకునే రోజు వస్తుంది “అని అనుకుని ఒకసారి ధాత్రి నీ చూసి ” అన్నయ్య ఇదివరకు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు అనుకున్న నీ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాను వదిన నా గెస్సింగ్ మొత్తం రాంగ్ అయిపోయింది అన్నయ్య ఏమాత్రం మామ్ కీ తీసిపోలేదు “అని బాధగా ఫీల్ అయ్యి రూమ్ వైపు వెళ్తుంది……

 

 

కిచెన్ లో ఉన్న ధాత్రి కీ వీళ్ళ మాటలు వినిపించక తన పని తాను చేసుకుని వాతావరణం ఇంకా చల్లబడడంతో పరుగున మెట్లవైపు వెళుతుంది……

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue