రిషి పడుకుని ఏడవడం చుసిన యోగ కి కళ్ళల్లో నీళ్లు వస్తాయి తన చెల్లి అంటే తన కి ప్రాణం చిన్న గాయం కుడా అవ్వకుండా తానే దగ్గర ఉండి జాగ్రత్త గా చూసుకునేవాడు ఇప్పుడు ఆలా రిషి ఏడుస్తుంటే యోగ రిషి పక్కన కూర్చొని రిషి అని మెల్లిగా పిలుస్తాడు…
కళ్ళు తెరిచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అన్నయ్య అమ్మ చుస్తే తిడుతుంది వేళ్ళు అంటుంది రిషి…..
యోగ రిషి ని తన ఒడిలో పడుకోబెట్టుకుని అమ్మ తో నేను మాట్లాడతా లే నువ్వు బయపడకు నీకు ఏమైనా తినాలి అని ఉందా అని అడుగుతాడు…..