ఈయనకి ఏది ఉన్న రాకపోయినా చిరాకు మాత్రం వెంటనే వస్తుంది అందుకే నేను అలా కన్నీళ్లు రాల్చానో లేదో వెంటనే గయ్యమంటూ ఇంత ఎత్తున లేచాడు.
కన్నయ్య ఊరుకో ఎందుకు ప్రతిదానికి చిరాకు పడతావు అంటూ ఆవిడ ఇద్దరికి కలిపి గోరుముద్దలు పెడుతూ ఉంటే కన్నీళ్లు తుడుచుకొని చాలా రోజులు ఆహా కాదు సంవత్సరాలు అది కూడా కాదు నాకు ఊహ తెలిసినప్పటినుండి ఇంత ప్రేమగా తినిపించింది ఆంటీ ఒక్కరే అనుకుంటా.
అప్పటినుండి నా మైండ్ లో తొలి చేస్తున్న ఒక డౌట్ ఏంటంటే ఆంటీ గారు ఎందుకు పొటాటో ఫ్రై మీ కొడుక్కి పెట్టడం లేదు అని నేను అడగానే మరోసారి నా వైపు ఒక లుక్ ఇచ్చి వాటర్ తాగేసి నాకు చాలు మా అంటూ వెళ్లిపోయారు ఆయన గారు.
నాకేమో కంగారు వచ్చేసింది. చి వేస్ట్ ఫెలో దాన్ని ఆయన తిన్నాక ఆంటీ ఒక్కరే ఉన్నప్పుడు అడిగి చావచ్చు కదా ఇప్పుడే అడిగాను అనవసరంగా రుద్ర గారు నా వల్లే తినకుండా వెళ్ళిపోయారు అని గిల్టీమేస్తూ నేను ఇది అయిపోతూ ఉంటే వాడికి పులిహోర పొటాటో ఫ్రై నచ్చదమ్మా అసలు వాడి పేస్ట్ ఏంటో కన్నతల్లిని నాకే ఇప్పటివరకు సరిగ్గా అర్థం కాలేదు మూడు బాగుంటే చేసింది తింటాడు లేదా అసలుకే టచ్ చేయడు కానీ ఈరోజు ఎందుకు కనీసం అయినా తిన్నాడు అని చెప్పగానే బాబోయ్ ఈయన చాలా టఫ్ మనిషే అనుకుంటూ అప్పుడు ఆంటీ తను తినగానే ఐశ్వర్య వంటలు చాలా బాగా చేశావమ్మా పులిహోర రుచిగా ఉంది అనగానే నాకు నేను రాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను.
కానీ ఒకటే బాధ ఆయన గారు సరిగ్గా తినలేదు ఆంటీ ని అడుగుదాం అనుకుంటే ఇప్పుడేగా చెప్పారు వాడు ఎప్పుడూ ఏం తింటాడో నాకే అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాలు అయినా అని అందుకే ఒకసారి వెళ్లి ఆయన గారిని కనుక్కొని ఏమన్నా చెప్తే వండుదాం అనుకుంటూ ఆంటీ తినగానే ఆ ప్లేట్ తీసేసుకొని టాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకోండి అని బయటికి రాగానే అందరికీ వడ్డించాల్సిన టైం అయిపోయింది ఆ పని అంతా తప్పించుకొని ఆ హిట్లర్ సార్ రూమ్ లోకి వెళ్లేసరికి టైం మూడు గంటలు ఈజీగా అయింది.
ఎక్స్క్యూజ్మీ అని పిలుద్దాం అనుకున్నాను మళ్లీ ఏదో ఒకటి అంటాడు అవసరమా అంటూ తలుపులు తెరిచే ఉన్న దానిమీద టప టపా కొట్టగానే పనిమనిషివి ఏంటి ప్రతిసారి రూమ్స్ లోకి అలా వచ్చేస్తున్నావ్ అని ఆయన గారు అనగానే ఉక్రోషం పొంగు కొచ్చింది ఏంటి ప్రతిసారి పనిమనిషి అంటున్నాడు అని దులిపేయాలనుకున్నాను కానీ ఎందుకో ఆయనని చూస్తే నేనేమీ అరవలేకున్నానే అనుకుంటూ మీరు టిఫిన్ కూడా చేయలేదు భోజనం కొంచమే చేశారు ఏమైనా చేసి తీసుకురమ్మంటారా అని నేను బయటనుండే అడుగుతుంటే ఫాస్ట్ గా నా దగ్గరికి వచ్చి వెళ్లి క్యారెట్ హల్వా చేసుకోరా అన్నాడు!