New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సమ్మోహనం – 14
సమ్మోహనం Premium 5 min read

సమ్మోహనం – 14

టైం 4:00 అవుతోంది.

 

కడప నుండి  వైజాగ్ ఒక ఫ్లైట్ వైజాగ్ నుండి నొయిడా డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్లాలని టికెట్స్ బుక్ చేశాడు హర్ష.

 

ఇక్కడ  6 కి ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం కావడంతో హాసిని నాలుగు గంటలకి రెడీ అయ్యి కూర్చుంది.

 

టాప్ లెగ్గింగ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంత లేదమ్మా సారే తీసుకొచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆ కాలనీలో ఉండే ముత్తయిదువులకు కంపల్సరిగా వాయినాలు ఇప్పించాలి అది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం అని భ్రమరాంబ గారు మధ్యాహ్నం చెప్పడంతో అందరూ హడావిడిగా ఆ పనుల మీదే ఉన్నారు.

 

చిన్న పేపర్ బాగ్స్ లో ఆకు ఒక్క రోజా పువ్వు ఇంకా హాసిని తీసుకువచ్చిన సారల్లో ఒక్కొక్క స్వీట్ మొత్తం మూడు రకాల స్వీట్ కలిపి రిటర్న్ గిఫ్ట్ గా సిల్వర్ కోటింగ్ ఉన్న కుంకుంభరినగా వేసి   సిద్ధం చేశారు నలుగురు లేడీస్ కలిసి.

 

మిగతా ఎవరన్నా చెప్పుంటే హర్ష ఆబ్జెక్ట్ చేసేవాడేమో భ్రమరాంబ గారు చెప్పేసరికి సైలెంట్ అయిపోయి ఆ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపి తప్పుకున్నాడు కాకపోతే సిక్స్ లోపు ఎయిర్పోర్టులో ఉండాలని హుకుం జారి చేసి మరీ.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue