New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రావమ్మా.. మహాలక్ష్మి

30 stories Ongoing Family Drama Love Inspirational

తూరుపు వెలుగు రేఖలు పరచుకుంటుంటే.. మరో వైపు పక్షుల కిలకిలా రావాలు సన్నగా వినబడుతుంటే.. లేలేత సూర్య రశ్మి పడి.. తెల్లని పాలరాతి సౌధంలా ఉన్న ఆ ఆధునాతన పాలస్ కొత్త వెలుగులు చిమ్ముతున్నట్టు ఉంది. భవంతి చుట్టూ పరిమళ భరిత పొడవైన పూల మాలలు వేలాడదీసి ఉన్నాయి. వాటి పరిమళం గాలిలో వ్యాపించి ఒక మత్తయిన సువాసన ఆ ప్రాంతం అంతా గాలిలో వ్యాపించి ఉంది. భవనం ముందు ఒకవైపు లాన్ మరో వైపు ఖరీదైన కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. భవనం ఎత్తయిన స్తంబాల మీదుగా గంభీరంగా నిలబడిబట్టు ఎవరినో ఆహ్వానించ డానికి సన్నధ్ధమయినట్టు సర్వాలంకార భూషిత అయి ఉంది. భవనం ముందు విదేశాలనుండి తెప్పించిన టైల్స్ తో ఏర్పాటు చేసిన రాచబాట.. 50 మీటర్స్…

Browse Stories

రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 20

మావయ్య.. అయితే మీకు కూడా.. ఆనంద్ ప్రతాప్ గారి గురించి తెలీదా.. అంది మహా. మీ అమ్మ చదివిన కాలేజీ లో ఎంక్వయిరీ చేశాను మహా… అతడు చాలా మంచి వాడని అందరూ చెప్పారు.. బాగా తెలిసిన ఒక స్నేహితుడు.. మీ అమ్మ సీతే అతడ్ని వదిలేసింది.. అన్నట్టు చెప్పారు.. నిజం ఏంటో మీ అమ్మ చెప్పదు.. మీ నాన్న ఊరొదిలి వెళ్ళిపోయాడు… అప్పుడు ఇప్పుడు ఉన్న అన్ని సదుపాయాలు లేవు.. మీ అమ్మ నాన్నల మధ్య […]

5 min 10 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 19

కంటిన్యూ గా విష్ణు నుండి కాల్ వస్తుంటే కార్ ఒక పక్కగా ఆపి.. కాల్ ఏక్సెప్ట్ చేసాడు వీర్.    హలో సర్.. అన్నాడు కంగారుగా విష్ణు.    విష్ణు.. చెప్పు.. ఇంకా అవమానం చేయాల్సింది ఏమైనా ఉందా?? అన్నాడు వీర్ స్టైల్ గా.    సర్.. ప్లీజ్.. ఎక్కడున్నారు.. నేను మీతో మాట్లాడాలి.. అన్నాడు విష్ణు.    హ్మ్.. సరే.. మీ ఏరియా లో చివరిగా ఉన్న రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తుంటా.. రా.. అని […]

5 min 10 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 18

వీర్ చిన్నగా నవ్వి..అంత దూరం నుండి వచ్చి.. నీతో అబద్దం చెప్తానా మహాలక్ష్మి..?? అని, ఆమె ముందు నిలబడి.. ఓహ్.. గాడ్.. నిన్ను చూస్తే మా మావయ్య ని చూస్తున్నట్టే ఉంది.. అన్నాడు వీర్.    సీత అతడిని పరికించి చూస్తు.. ఎవరు నువ్వు?? అంది.    సుప్రజ దెబ్బ తిన్న పులిలా చూస్తుంది. విష్ణు లో మౌనంగా ఒక అగ్ని పర్వతం రగులుతుంది. సురేంద్ర, ప్రణతి ఆశ్చర్యం గా చూస్తున్నారు. మహా కి జరుగుతున్నదేదీ అర్ధం […]

5 min 9 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 17

మీ అబ్బాయికి ముందే పెళ్లి జరిగిందా..?? అని అడిగాడు సురేంద్ర అసహనం గా.    “అదేం మాట సురేంద్ర గారు.. మేమేం తప్పు చేశామని అలా అడుగుతున్నారు? మొగుడ్ని సరిగ్గా చూసుకోక  ఇంకోడితో లేచిపోయిన దాన్ని వదిలేసిన మా అబ్బాయికి, ఈ పిల్లను ఇవ్వడం మీ అదృష్టం అనుకోవాలి..” అహంకారంగా అన్నాడు అబ్బాయి తండ్రి. ​ఆ మాట వినగానే సీత గుండె పగిలినట్టయింది. మహాలక్ష్మి చిన్నప్పటి నుండి పడిన మానసిక వేదన, ఆ తండ్రి దూరమయ్యాడన్న లోటు […]

5 min 8 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 16

మీకు ఇంకెంత మంది సురేంద్ర లు తెలుసు.. అంటూ వీర్ మాధవయ్య చూపు ని అనుసరించి విష్ణు ని చూసాడు సంకోచంగా.    మెసేజ్ వైపు వింతగా చూస్తూనే.. మీరు.. మా నాన్న కోసం ఎందుకు వెదుకుతున్నారు?? అన్నాడు విష్ణు ఆశ్చర్యం గా.    సురేంద్ర గారు.. మీ నాన్న.. నిజం గానా..?? నేను వెదుకు తున్న సురేంద్ర గారి గురించేనా నువ్వు చెబుతున్నది.. అన్నాడు వీర్.    మీ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారా ఏంటి..?? ఈ […]

5 min 8 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 15

కృష్ణా కాలేజ్ ఆఁ..?? కాలేజ్ లో పనేంటి సర్..? అన్నాడు విష్ణు.    హ్మ్.. తరువాత చెప్తాను విష్ణు.. ముందు నేను చెప్పినట్టు చెయ్యి.. ముందు కాలేజ్ కి వెళ్ళు.. అన్నాడు వీర్.    సరే.. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను.. నేను దగ్గర్లోనే ఉన్నాను.. అని ఫోన్ పెట్టేసాడు విష్ణు.    తన వైపు శ్రద్ధ గా చూస్తున్న శారద వైపు చూసి.. ఏంటి అలా చూస్తున్నారు? అని అడిగాడు వీర్ ఫోన్ జేబులో పెట్టుకుంటూ.  […]

5 min 8 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 14

గదిలోకి వెళ్లి అందంగా ముస్తాబు చేస్తుందే గానీ మహా దూరం అయిపోతుందన్న బాధ ప్రణతి కళ్ళల్లో సుళ్ళు తిరుగుతూనే ఉంది.    మహా ప్రణతి బాధని అద్దం లోంచి చూస్తూనే… ప్రణతికే ఇంత బాధ ఉంటే విష్ణు… విష్ణు ఎంత బాధ పడుతున్నాడో.. అసలు ఎక్కడి కెళ్ళి పోయాడో.. పోనీ ఒకసారి కాల్ చేస్తే.. అప్పుడు ఏదో ఆశ కలిగిస్తానేమో.. ప్చ్.. అని నిట్టూర్చి,   పోనీ సుప్రజత్త మంచిగా మారిన బావుండు.. ష్.. వద్దు.. మళ్ళీ […]

5 min 8 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 13

కొత్త చీర, పూలు రోల్డ్ గోల్డ్ నగలు పట్టుకుని వచ్చింది ప్రణతి ఉదయాన్నే.    అత్తయ్య.. నీ కూతురి కోసం తెచ్చాను.. పెళ్లి చూపులు కదా.. ముస్తాబు చెయ్యాలి గా.. వెటకారం గా అంది ప్రణతి.    ప్రణతి.. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు.. మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాక కాదని చెప్పేంత ధైర్యం మాకెవరికి లేదు.. అంది సీత.   అత్తయ్య.. మహా నీ కూతురు.. నీకేం హక్కు లేదంటావ్ ఏంటి?? దాని […]

5 min 7 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 12

మహా.. ఈ చీర కట్టుకుంటావా.. అన్న తల్లి మాట విని వెనక్కి తిరిగి చూసింది మహా.    నీరసం గా ఉన్న ముఖం చూసి.. ” ఏమైందే.. అలా ఉన్నావ్? ” అంది సీత.    హ్మ్.. ఏదో తెలియని బాధ ఉందమ్మా మనసులో.. అదెందుకో తెలియడం లేదు.. ఇప్పుడే కదా చదువు పూర్తయింది.. అప్పుడే పెళ్లి చూపులు ఏంటమ్మా..?? నాకు కొంత అవకాశం ఇవ్వాలి కదా.. అంది మహా జాలిగా ముఖం పెట్టి.    జీవితం […]

4 min 9 views
రావమ్మా.. మహాలక్ష్మి Premium

రావమ్మా.. మహాలక్ష్మి – 11

అక్క.. ఏంటి నన్నే అడుగుతా అంటున్నావు.. రాగానే యుద్ధం ప్రకటిస్తున్నావా ఏంటి?? అన్న మాట విని వెనక్కి తిరిగింది ప్రణతి.    నీరసం గా అలసిపోయిన ముఖం తో జీవం లేని చిరునవ్వు తో ఉన్నాడు విష్ణు.    ఏంట్రా.. అంత నీరసంగా ఉన్నావు.. ఆఫీసులో పని ఎక్కువగా ఉందా ఏంటి..?? అని అడిగింది ప్రణతి.    రాత్రి నిద్ర పట్టలేదు.. ఆఫీస్ లో కూడా పని ఒత్తిడి.. చిన్న సమస్య.. అందుకేలే.. అన్నాడు విష్ణు.    […]

5 min 8 views