పూర్ణివ్ కి ఉన్నది వాళ్ళు ఇద్దరే కాబట్టి .. వాళ్ళ దగ్గర నిజం దాచకుండా మొత్తం చెప్పి … అతని డౌట్ గురించి కూడా చెప్పాడు.
మొత్తం విన్న నాగేంద్ర , గాయత్రి గారు వాళ్ళు జేష్ఠ కి పెళ్లి అయింది అని తెలిసి షాక్ అయిపోయారు.
వాళ్ళకి ఇంకా ఆ నిజం నమ్మబుద్ధి కావడంలేదు లేదు…
అసలు ఆ రోజు నువ్వు కార్ లో ఎవరినో చూసి ఉంటావ్ పూర్ణివ్…. అది మన జేష్ఠ అయ్యి ఉండదు … బాగ గుర్తు చేసుకొని .. అని అంటారు గాయత్రి గారు.