ఇందాకే చూసావు కదా బావా వాళ్ళని ఒక మాట అంటే ఎలా అడ్డుకున్నాడో ఇకమీద కూడా బావ అలాగే అడ్డుకుంటాడు కాబట్టి నువ్వు అసలు భయపడాల్సిన పనిలేదు అంటూ తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది మైత్రి
మొత్తం అందరి గురించి తెలుసుకుంటూ అందరి మీద ఒక క్లారిటీకి వచ్చింది జనని
సరిగ్గా అప్పుడే అక్కడికి రానా రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైత్రి
జననీ కి కొంచెం భయంగా ఉంది ఇందాక రూమ్లో రానా ప్రవర్తించిన తీరుకి కానీ భయాన్ని లోపలే దాచేస్తూ పైకి మాత్రం నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంది