ఎపిసోడ్ 90
స్వప్నిక వీజేల కోసం ఫంక్షన్ హాల్ అంతా వెతికి వచ్చిన మహేష్, అక్కడ వధువు గదిలో వీళ్లిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు..
చీర కోసం తంటాలు పడుతున్న వీజేని చూసి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మహేష్..
“ఇప్పుడు ఏం చేయాలి చెప్పు..”అని అడిగాడు విజె..
అక్కడ టేబుల్ పైన సేఫ్టీ పిన్స్ ఓ నాలుగైదు కనిపించాయి.. కొన్ని టిష్యూ పేపర్స్..రబ్బర్ బ్యాండ్స్ లాంటివి పడి ఉన్నాయి..
“విజె..అక్కడ ఉన్న సేఫ్టీ పిన్ తీసుకోండి”