New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
My obsessive younger husband 🦁 part -1 – 4

My obsessive younger husband 🦁 part -1 – 4

 

 

 

 

సింహం’స్ రామ నిలయం 

 



 

నేను పద్మవ్యూహంలో లోచిక్కుకున్న అభిమన్యుడు అనుకుంటున్నారా పద్మవ్యూహాన్ని చేధించే అర్జునుడిని…… క్రూరమైన చూపుతో అర్జున్…. అర్జున్ సింహ… సన్ ఆఫ్ విజయ్ సింహ…….అని అంటూ గట్టిగా సింహ లా గర్జించాడుఅలా గర్జిస్తూనే ఒక్కసారిగా పైకి లేచాడు ఆ గర్జనకు గాలి కూడా బలంగా వీచి అతన్ని తాకగా… షర్ట్ వెనక్కి జరిగి అతని దృఢమైన ఛాతి కనిపిస్తూ ఉంటే ప్రళయ రుద్రునిలా చింత నిప్పులు కక్కుతూ 

ఎక్కడో పిడుగు పడిన పిడుగు పాటుకు మంట చెలరేగింది అగ్నిజ్వాలలు అతని వెనుక కనిపిస్తూ ఉంటే ఆ మంటల వెలుగులో అగ్నిగోలంలా భయంకరంగా ఉన్నాడు 

 

 



 

                          అర్జున్ సింహ 🦁

 

     (ఎలా ఉన్నాడు మన హీరో)

 

 

అతని శ్వేత వర్ణంలో ఉన్నా షర్ట్ రుధిర వర్ణంలోకి మారిపోయింది ….

 

నెత్తుటి కళ్ళతో చూస్తూ రిషబ్ ,రుద్విక్ వైపు చూపు తిప్పి “ఇంకా ఎవరైనా మిగిలారా….!!! అని బేస్ వాయిస్ లో గంభీరంగా అడిగాడు …

 

వాళ్ళు ఒక్కసారి ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చి లేదు అని తలలు అడ్డంగా ఊపారు ….

 

“రిషి కారు తీయి డాడ్ ను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళు గో క్విక్….!!!! అర్జున్ తన బేస్ వాయిస్ లో అనగానే…

 

రిషబ్ కారు తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి నిలబడగానే 

విజయ్ గారి నీ ఎత్తుకొచ్చి వెనుక సీట్లో కూర్చోబెడతాడు అర్జున్… 

 

వెంటనే రుద్విక్ వెనక కూర్చుంటూ “అన్నయ్య నువ్వు…!!! అని అర్జున్ కారు లో నుంచి చూస్తూ అనగానే  

 

“ఐ విల్ బి దేర్ ఇన్ 20 మినిట్స్… గో ఫాస్ట్ రిషి కేర్ఫుల్ ఆన్ ద వే…!!! అర్జున్ బేస్ వాయిస్ లో చెప్పగానే…

 

అక్కడున్న ఇద్దరు ఆడవాళ్ల తో సహా హాస్పిటల్ కి వెళ్తారు… 

 

20 నిమిషాల్లో వెళ్లాల్సింది 10 నిమిషాల్లో హాస్పిటల్  కి చేరుకుంటారు…

 

హాస్పిటల్ వాళ్లదే కావడంతో వెంటనే రియాక్ట్ అయ్యి ఎమర్జెన్సీ కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు…

 

బయట కూర్చొని ఏడుస్తున్న ఆ ఆడవాళ్ళిద్దరినీ రిషి,రుద్వి ఓదారుస్తూ….ఉన్న కూడా వాళ్ళకు కూడా ఏడుపు ఆగట్లేదు… 

 

 

****************************************************************************

 

విల్లా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని మొబైల్ తీసి కాల్ చేసి “రేయ్ ఎక్కడున్న 10 మినిట్స్ లో విల్లాకి రా లేకపోతే 5 మినిట్స్ లో నీ డెడ్ బాడీ బీచ్ లో ఉంటది…!!! అంటాడు.. అర్జున్ అతని మాట వినకుండానే కాల్ కట్ చేశాడు… 

 

 

 

అతను ఉలిక్కిపడి ఫోన్ వైపు చూస్తూ….

“ఆదమరిచి నిద్రపోతున్న నన్ను లేపి వార్నింగ్ ఇస్తావా నీ …..!!! అని తిట్టుకొని మళ్ళీ ఆలోచనలో పడి “ఇంతా రాత్రి వేళ ఎం జరిగి ఉంటుందబ్బా…!!! అనుకుంటూ “అమ్మో వెళ్ళకపోతే వాడు నా తాట ఓలుస్తాడు…!! అనుకుంటూ …

మొఖం కూడా కడుక్కోకుండా లేచి 10 మినిట్స్ అన్నవాడు 5 మినిట్సలోనే అర్జున్ ముందు ఉంటాడు… 

 

 

అక్కడ జరిగింది అంతా చూసి నోరు తేర్చుకుని అలాగే లోపలికి వెళ్ళి అర్జున్ ను చూసి ఒక్కసారిగా వెనక్కి అడుగు పడి భయంతో కళ్ళు పెద్దవై చూస్తూ అక్కడే ఆగిపోతాడు….అతను… 

 

కళ్ళు పైకెత్తి ఫోన్ పాకెట్ లో పెట్టుకుంటు లేచి వెళ్ళి అతను భుజం మీద చెయ్యి వెయ్యగానే ఉలిక్కిపడి అర్జున్ నీ చూస్తాడు …

 

“అసలు ఎం జరిగింది రా..? ఏంటి ఇదంతా ఎవరు వీళ్ళంతా..? అడుగుతాడు ఆశ్చర్యంగా…😳 

 

“హ్మ్మ్….!!అని అతని వైపు చూసి”మా చుట్టాలు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే చుట్టచుట్టి పెట్టాను పట్టుకు పోతావని రమ్మన్నాను…!! అంటూ…

 

అతనితో మాట్లాడుతూనే వేగంగా మెట్లు ఎక్కుతూ తన రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ అంటాడు అర్జున్ చాలా వెటకారంగా ….

 

“ఏంటి వెటకారమా.. !!??అని ముఖం అదోరకంగా పెట్టుకుని అంటాడు అతను …

 

“మరి నువ్వేం చేస్తావ్..? అన్ని నన్ను అడుగుతున్నావ్….? అని అంటాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ..

 

“ముందు ఏం జరిగిందో చెప్పురా ప్లీస్ భయమేస్తుంది…?? ఎవ్వరికి ఏం కాలేదు గా..!!!

 

 

జరిగింది అంత చెప్తూనే బయటికి అడుగులు వేస్తూ “ఇదంతా మార్నింగ్ వరకూ క్లియర్ అవ్వాలి..! నేను హాస్పిటల్కి వెళ్తున్నా…!!!

 

 

“అండ్ వన్ మోర్ థింగ్ ఇది ఎవరు ఎందుకు చేసారో… అండ్ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో… నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి…!!! అని  కారు డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ కారు స్టార్ట్ చేసి స్పీడ్ వెళ్ళిపోతాడు అర్జున్… అతని సమాధానం వినకుండానే… 

 

అర్జున్ వెళ్ళిపోగానే కొంచెం కంగారుగా ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి 

“ఐ ఆమ్ ఏసీపి కరణ్ “….!!

 

“నేను చెప్పిన ప్లేస్ కి ఫాస్ట్ గా రండి…!! అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ….

 

 

 

************************************

 

కరణ్ ఎవరు?

తెలిస్తే కామెంట్ చేయండి….

 

స్టోరీ నచ్చిందా.. ?ఎలా ఉంది…?

 

కామెంట్ ఇచ్చేసేయండి దోస్తులు…🙎❤️

 

ఫాలో కూడా చేసేయండి 🏃🏃‍♀️

 

comment must bigulu….✍️

 

 

please give me your support and quality reviews …..🙏🙏🙏🙏🙏

 

 

 

 

 

 

 

 

 

                     ✍️ మీ Neeru’s “RAM”