New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
My obsessive younger husband 🦁 part -1 – 1

My obsessive younger husband 🦁 part -1 – 1

సమయం రాత్రి 11 గంటలు

కారుమబ్బులతో ఆకాశమంత నల్లగా మేఘావృతమై ఉంది. పెద్ద పెద్ద ఉరుములతో మెరుపులతో మేరుస్తూ ఉంది ఆ ఆకాశం….

 

రాజమహల్ నీ తలపిస్తున్న ఒక విల్లా అంతా చీకటి నల్లగా నిశీధి ల కారుమబ్బులతో కమ్మేసిన ఆ విల్లా చుట్టూ బయట వాతావరణం బీభత్సంగా మారి పిడుగులు కురిపిస్తూ ప్రకృతి ప్రళయాన్ని సృష్టింస్తుదేమో అన్నట్టు గా ఉంది ..

 

ఆ మహల్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో “సింహా’స్ రామ నిలయం” అని గోల్డెన్ కలర్ లో మెరుస్తూ ఉంది… దానికి పెద్ద మెయిన్ డోర్ కి ముందు కొంచెం దూరంలో మధ్యలో రెండు వాటర్ ఫౌంటెన్ లోంచి నీరు ఎగసి పడుతుంటే… వాటి మధ్యలో ఒక పెద్ద రథం…పెద్ద పెద్ద చక్రాలతో రెండు తెల్లటి గుర్రాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టు ఎగురుతూ రంకెలు వేస్తున్నట్టు ఉంది ఆ చెక్కతో చేసిన రథ శిల్పం ….

 

కాని ఆ మహల్ నీ చుట్టుముట్టిన కొందరు రౌడీ లు చూడ్డానికి భయంకరంగా ఉండి పదిహేను మంది సెక్యూరిటీనీ కొట్టి లోపలికి ప్రవేశించారు…

నల్లని దుస్తులు ధరించి బాగా బలసిన దేహాలతో వేట కుక్కల ఆ ఇంట్లో కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే, 

ఇంటి లోపల ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు ప్రాణ భయంతో వణికి పోతున్నారు…

అప్పుడే అక్కడికి రోల్స్ రోవర్స్ కారులో వేగంతో దూసుకుచ్చి ఆ కారుని సర్రున ఒక రౌండ్ తిప్పి కారు ఆగే లోపే అందులోంచి ఒక్క ఉదుటున దూకి ఆ రౌడీ ల మీదకు విరుచుకు పడతాడు “విజయ్ సింహ గారు” ఆ కారు సర్రున తిరిగి మీదకు వెళ్ళి పడగానే ఎగిరి పడతారు కొందరు…

 

ఇంకా విజయ్ సింహ గారు ఆగకుండా ఒక్కొకడి మీద కి దూసుకెళ్తారు….

అడ్డొచ్చిన ఒక్కొక్కడిని భయంకరంగా కొడుతూ ఉంటే ఆ రౌడీ లు కింద పడి స్పృహ కోల్పోతుంటారు… 

ఇక్కడ జరగుతున్న ఇదంతా ముగ్గురు వ్యక్తులు లైవ్ చూస్తూ ఉంటారు…

 వైన్ తాగుతూ ఒక గెస్ట్ హౌజ్ లో

ఈ రౌడీలలో ఒకడు  చెవిలో బ్లూటూత్ పెట్టుకుని, ఇదంతా లైవ్ లో వీడియో రూపంలో చేరవేస్తుంటాడు ఆ ముగ్గురు కి …

వాళ్ళు విజయ్ సింహ ఇవ్వాళ ఎలాగైనా చస్తాడు… అని ముందే పార్టీ చేసుకుంటూ మందు తాగుతూ లైవ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు …

 

విజయ్ సింహ గారు ఆగకుండా కొడుతూ పోతుంటే ఒక రౌడీ రాడ్ తీసుకుని విజయ్ సింహ మీద కి వెళ్లగానే ఆ రాడ్ ఉన్న చెయ్యి పట్టుకుని గుండెల మీద పంచ్ ఇవ్వగానే వాడు కింద పడి ఆ రాడ్ వదిలేస్తే ….దాన్ని తీసుకొని మిగిలిన రౌడీల మీదకి వెళ్ళి కడుపులో , వెన్నులో , తలమీద ఇలా అడ్డొచ్చిన వన్ని కొట్టుకుంటూ పోతుంటే కొంతా మంది వాళ్ళ ఫ్యామిలీ మీద కి వెళ్లబోతరూ…వెంటనే రియాక్ట్ అయ్యిన విజయ్ సింహ వాళ్ళ కి అడ్డుగా నిలబడి 

“డోంట్ డేర్… నా ఫ్యామిలీ జోలికి వెళ్తే ఐ స్వెర్ ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలు కింద నరికేస్తా..!!! అని కోపంగా కళ్ళెర్రా చేసుకొని వెలు చూపిస్తూ గట్టిగా అరిచి గంభీర స్వరంతో అంటాడు..

 

సిక్స్ ఫీట్ హైట్ తో బలమైన దేహంతో చూడ్డానికి గంభీరంగా ఉన్న అతని చూసి కొంచెం వెన్నక్కి జంకుతారు ఆ రౌడీలు …

 

లైవ్ చూస్తున్న ముగ్గురు లో ఒకడు “రేయ్ వాన్ని చంపండి రా చంపేయండి..!!! అని అరుస్తాడు 

బ్లూటూత్ నుండి వింటూన్న వాడు పక్కన రౌడీలకూ సైగ చేస్తాడు.. 

ఇంకా ఎక్కువ మంది ఒకేసారి దాడి చేయగా విజయ్ సింహ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా ఫైట్ చేస్తూవుంటే…

“లైవ్లో చూస్తున్న ముగ్గురు లో ఒకడు “రేయ్ లక్షలక్షలు డబ్బు తీసుకొని చచ్చారు కదరా ఒక్కడు కూడా ….!!! ఛీ…!!

ఇంకొకడు “వాడు ఏమన్నా ఆకు రౌడీ అనుకుంటున్నావా “”boxing champion”” ఒకప్పుడు మక్కెలు విరగొడ్తడు…!! 

“మీ వెపన్స్ తీసి ఎటాక్ చేసి చావండి రా…!!! అంటాడు

 

విజయ్ సింహ కొట్టే దెబ్బలకు నెలకు ఒరిగి పోతున్నారు… 

అదిచూసి ముగ్గురిలో లీడర్ క్రూరంగా చూస్తూ గట్టిగా నవ్వుతూ వైన్ సిప్ చేస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు ముఖాలు చూసుకుంటారు… 

“ఏమైంది” అని అతన్ని వింతగా చూసి అడగ్గానే 

“నేను పిచ్చివాడిని అనుకున్నారా… వాడి గురించి తెలిసి కూడా తెలివి తక్కువ వాడిలా ఉంటానా..!!! “వాడిని ఎలా చంపాలో దానికి వేరే వేపన్ ఉంది దాన్ని వాడుత…!!!అని ఫోన్ తీసుకుని మెయిన్ రౌడీ కి మెసేజ్ చేయగా …

 

ఆ రౌడీ తన వెనుక వైపు చూసి కనుసైగ చేస్తాడు… వెళ్ళు అన్నట్టు ….అక్కడున్న వ్యక్తి వెళ్ళి విజయ్ సింహ గారు ఆ రౌడీలతో తలపడుతుండగా వెన్నులో వేటు దింపాడు ఆ వ్యక్తి…కత్తితో…

 

అంతే ఒక్క క్షణం ఆగి ఆ కత్తి పట్టుకున్న వ్యక్తి నీ ముందుకు లాగి కొట్టబోతే వెనక్కి తూలి పడిపోతూ “జగన్నాధం” అని పిలుస్తాడు ప్రేమగా… 

 

అతను కళ్ళ నీళ్ళతో గట్టిగా ఏడుస్తూ “ఐయాం సారి రా ఐయాం రియల్లీ సారీ రా.. !!!అంటూ జారబడి ఏడుస్తూ కూర్చుండిపోయాడు….

 

విజయ్ గారి కనుబొమ్మలు ముడి పడి ఆశ్చర్యంగా చూస్తూ అతని రెక్క పట్టుకుని పైకి లేపి “ఏం జరిగింది”…!! అని గట్టిగా గంభీర స్వరం తో అరుస్తాడు …

“నన్ను ఏం అడగకూ నువ్వు చావలి అంతే చావలి..!!! అంటూ వెంటనే లేచి మళ్ళీ కత్తితో పొడిచాడు…

 

ఇంతకి ఏం జరిగిందో … ఈ జగన్నాధం ఎవరు 🤔

ఆ ముగ్గురు ఎవరు 🤔🤔🤔 ఎందుకు విజయ్ గారిని చంపాలి అనుకున్నారు… విజయ్ గారికీ ఏమవుతుంది… తెలియాలంటే….

 

follow me and comment for next episode 

 

రచయిత గా నా ప్రయాణం మొదలైంది…ఇది నేను వేస్తున్న మొదటి అడుగు… నా ఈ ప్రయాణంలో నా అడుగులు తడబడి తప్పటడుగులు పడితే ఒక మంచి మార్గంలో నడిపించి మార్గదర్శకులై మార్గనిర్దేశం చూపిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ నా పాఠక దైవాలకు….🙏🙏🙏🙏🙏.. ఇదే నా విన్నపం … మరియు విజ్ఞప్తి… మీరు ఆదరించాలని ఆశిస్తున్నాను….

 

 

మీకు స్టోరీ నచ్చుతుంది కచ్చితంగా… నేను హామీ ఇస్తున్న… 

 

please give me your support and quality reviews🙏🙏

 

            ✍️  మీ Neeru’s “RAM”