New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
My obsessive younger husband 🦁 part -1 – 3

My obsessive younger husband 🦁 part -1 – 3

 

 

 

 

 

 

 

 

 

అతను చేస్తోంది ఫైటింగ్ కాదు వార్…

తన వాళ్ళని దక్కించుకోవడం కోసం చేసే ఒక యుద్ధం…

 

అలా మెరుపు వేగంతోఇరవై మందిని కత్తులతో దాడి చేసి రెండు చేతులతో సవ్యసాచిలా చేస్తున్న అతని ధాటికి నిలువరించలేకపోతున్నారు….. 

 

(అతను రెండు చేతులతో వర్క్ చేయగల సమర్థుడు అందుకే అతను సవ్యసాచి అంటారు…)

 

అతని చేతిలో ఆయుధం ఉంటే అతన్ని ఆపే శక్తి ఎవ్వరికి లేదు…

 

ఒక యోధుడు….ఒక క్షత్రియుడు… యుద్ధం చేస్తే ఎలా ఉంటదో… అలా ఉంది అతనీ దూకుడు…

 

 

ఇంకా ఆగకుండా వస్తున్న ఆ రౌడీల మీదకు ధనస్సు వింటినారి లో నుంచి దూసుకు వస్తున్న బాణంలా రెండు చేతులతో కత్తులను తిప్పుతూ వాళ్ళ శరీరాలు చీల్చుకొంటూ…. దూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు….

 

ఒక్కొక్కడిని భయంకరంగా చంపుతూ ఉంటే రక్తం చిమ్మి అతని మీద పడి చూస్తేనే వణుకు వచ్చేలా ఉంది అతని ముఖం…..

 

పెద్ద పెద్ద ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం మొదలయింది… 

జోరున కురుస్తున్న వర్షానికి పెళపెల మని ఉరుముల శబ్దానికి ధడేల్.. ధడేల్.. మని పిడుగు పాట్లకు అక్కడ వాతావరణం భయంకరంగా మారిపోయింది….

 

వాళ్ళ శరీరాలను చీల్చుతున్న ఆ కత్తులను గాల్లోకి ఎత్తి అటూ ఇటూ తిప్పాడు అతను…

 

వాటి నుంచి రక్తం కారుతూ కిందకి చేరగా ఆ వర్షం నీటిలో క్లూక్..క్లూక్ ..క్లూక్ .. మని శబ్దం వినిపిస్తూ ఉంది…. 

 

ఆ శబ్దానికి అక్కడున్న రౌడీల కు వెన్నులో వణుకుతుంది…. 

 

అతని భీకరమైన రూపాన్ని చూస్తున్న ఆ రౌడీ లకు వర్షంలో కూడా తల్లో నుంచి చెమటలు కణతల నుంచి కారిపోతున్నాయి…

భయంతో చూస్తూ బిక్కు బిక్కు మంటూ ఎదురుదాడి చేయకుండా ఒక్కక్షణం ఆగిపోయారు….

 

 

రిషబ్ సింహ, రిధ్విక్ సింహ ల వైపు తిరిగి చూసి అడుగులు వేసాడు….

 

వాళ్ళని పట్టుకున్న రౌడీలు వాళ్ళను వదిలేసి వెనక్కి అడుగులు వేసారు… అతని భీకర రూపాన్ని చూసి…

 

అతని అడుగులు ముందుకు పడుతుంటే ఆ రౌడీ ల అడుగులు వెనక్కి పడుతున్నాయి….

 

అతన్ని చూసి భయబ్రాంతులతోనే అతని మీదకు ఎటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు… 

 

 

****************************************************************************

 

 

ఇక్కడ లైవ్ లో చూస్తున్న ఆ ముగ్గురు ఒకరిమొఖలు ఒకరు చూసుకుంటూ “విడేంటి ఇలా ఉన్నాడు.. మనీషా… లేక మృగమా… అలా చంపుతున్నాడు….!!!అనుకుంటున్నారు…

 

అందులో ఒక వ్యక్తి “వాడి మీదకు ఒకేసారి దాడి చేయండి… !!!వాన్ని ఎలాగైనా చంపండి రా…!!

 

“లేదoటే వాడు మీతో పాటు మమ్మల్ని వదలడు…!!!

 

“వాన్ని చంపకపోతే మిమ్మల్ని అందర్నీ బాంబు పెట్టీ లేపేస్త నా కొడకల్లారా…!!! అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆ రౌడీ లకు 

 

****************************************************************************

 

ఇవతల ఉన్నా వాడు బ్లూటూత్ ద్వారా విని అలాగే అని అందరూ ఒకేసారి అతన్ని చుట్టూ ముట్టి రౌండ్ అప్ చేసారు….

 

అక్కడున్న రిషబ్ సింహ, రిధ్విక్ సింహ అతన్ని చూసి పిలిచి “ఆగరా వద్దూ మేం కూడా ….!!!అని రిషబ్ అనే లోపే ఏమరుపాటుగా ఉన్నా అతని పై వేటు పడింది… 

 

నలుగురు వచ్చి గట్టిగా అతన్ని పట్టుకుని చేతుల్లో కత్తులు లాక్కొని కొట్టబోయే లోపే సింహం జూలు విదిలించినట్టు తన బలమైన భుజాలను విదిలించి కొట్టాడు…. 

 

అలా విదిలించగానే వాళ్ళు ఎగిరి అల్లంత దూరంలో దబ్… దబ్…మని పడతారు….

 

అతని చేతిలో ఆయుధం లేదు, అందరూ చుట్టుముట్టారు.…. 

 

అతను ఒక్కసారి అంత చుట్టూ చూసి పరుగు పెట్టాడు…

 

“అరేయ్ పారిపోతునడూ రా…!!!అని అక్కడున్న రౌడీలతో సహా లైవ్ చూస్తున్న ఆ ముగ్గురు కూడా గట్టిగా నవ్వడం ప్రారంభించారు… 

 

రిషబ్, రుద్విక్ లు కూడా షాక్ అయ్యి చూస్తారు….

 

ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి సడన్ గా ఆగి నిల్చునాడు.…. 

 

ఆ రౌడీలు కూడా అతని వెంబడిస్తూ..విడువకుండా చుట్టూ ముట్టే ఉన్నారు… 

 

ఆ రౌడీలకు అతను ఎందుకు ఆగాడో అర్ధం కాక అయోమయంగా చూస్తూ ఉండగా… 

 

 

అక్కడున్న రథం నుంచి చక్రాన్ని గట్టిగా పట్టుకుని బయటకు లాగి .. పైకి ఎత్తి….రౌండ్ గా చక్రాన్ని గిర… గిర.. మని తిప్పుతూ వాళ్ళమీదకు దూసుకుపోయాడు…

 

(ఫస్ట్ ఎపిసోడ్ లో రథం గురించి చెప్పాను)

 

వాళ్ళు నవ్విన ఒక్కక్షణం పట్టలేదు… 🤦

 

మళ్ళీ వాళ్ళ ముఖాల్లో భయం స్టార్ట్…..

 

ఆ చక్రాన్ని గిరగిరా తిప్పుతూ ఒక్కొక్కడిని గాల్లోకి ఎగరేసి కొడుతున్నాడు…. 

 

అలా చక్రాన్ని గాల్లో తిప్పుతూ ఉంటే ఆకాశంలో పెద్ద మెరుపులతో ఒక్కసారిగా వెలుగు ప్రకాశిస్తూఉంటే అతని ముఖం చూస్తే ……🦁 రుద్ర సింహం లా ఉన్నాడు 😱

 

ఇటు ఫ్యామిలీ మెంబెర్స్ , రౌడీలు, లైవ్ చూస్తున్న వాళ్ళు నిర్ఘాంతపోయి రెప్ప కూడా వేయకుండా స్తంభించిపోయి చూస్తున్నారు…. అతన్నే….

 

****************************************************************************

 

ఆ ముగ్గురు కూడా…..😱

 

“విడేంటి రా పద్మవ్యూహంలో అభిమన్యుడు లా చేతిలో ఆయుధం లేకుండానే రథచక్రంతో నే అందరినీ తురమనడుతున్నాడు ….!!! అంటాడు లైవ్ లో చూస్తున్న వ్యక్తి…

 

అలా చక్రాన్ని చేతితో తిప్పుతూ ఒకడి తల మీద…. ఛాతీ మీద కాళ్ల మీద కొడుతూ… ఉంటే ఒక్కక్కోడి ఆర్తనాథాలు గాల్లో కలిసి పోతున్నాయి…. 

 

అక్కడున్న ఒక్క రౌడీ లను కూడా వదలకుండా కొట్టి బీభత్సం సృష్టించాడు…. పినుగు పెంటల కిందా కొట్టేసాడు….అతను… 

 

రక్తం వర్షం నీటిలో ఏరులై పారుతూ ఉంది.,….

 

కొట్టి కొట్టి కుప్పగా ఒకరి మీద ఒకరినీ పడేసి వాళ్ళ మీద కూర్చున్నాడు…. తల కిందకి దించేసి ఒక కాలు కిందకి మరొక కాలు వాళ్ళ మీద ఉంచి ఒక చెయ్యి కాలు పైన పెట్టుకుని…. 

 

అతని కనురప్పల మీద నుంచి రక్తం కారుతూ బిందువుల రూపంలో నేలను తాకుతుంది….

 

అక్కడంతా…ఒక్కసారి గా నిశ్శబ్దం నెలకొంది 

ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ…. 

 

నేను పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమాన్యుడు అనుకుంటున్నారా …… ఆ పద్మవ్యూహన్నీ చేధించే అర్జునుడిని…… అర్జున్….. అర్జున్ సింహ….. సన్ ఆఫ్ విజయ్ సింహ….. అంటూ… సింహం గర్జినట్టే గర్జించాడు…. 

అలా గర్జిస్తూనే ఒక్కసారిగా పైకి లేచి చేతులు చాచాడు… అలా లేచినప్పుడే ఒక్కసారిగా గాలికి అతనీ షర్ట్ వెనక్కి జరిగి అతని దృఢమైన ఛాతి కనిపిస్తూ ఉంటే అతని వెనుక ఆకాశంలో పిడుగు పడి పెద్ద శబ్దం చేస్తూ పెద్ద మంట చెలరేగింది…. అప్పుడు అతని చూడ్డానికి ప్రళయ రుద్రునిలా నెత్తుటి కళ్ళతో మండే అగ్నిగోలoలా భయంకరంగా ఉన్నాడు…

 

(ఇదంతా ఎట్ ఎ టైమ్ లో జరుగుతుంది ఇమాజిన్ హిం వన్స్)

 

 

అతని అలా చూడగానే వాళ్ళ ఫ్యామిలీ నిర్ఘాంతపోయారు… 

 

ఇక్కడ ఆ ముగ్గురు దానికి భిన్నంగా ఏం లేరు నోరు తెరిచి చూస్తూనే ఉన్నారు… 

 

అతని శ్వేత వర్ణంలో ఉండాల్సిన షర్ట్ రుధిర వర్ణంలోకి మారిపోయింది… 

 

అతని చూపు తిప్పి రిషి …రుద్వి… “ఇంకా ఎవరైనా మిగిలారా…??!! అని గంభీరమైన స్వరంతో అడిగాడు…

 

వాళ్ళు ఒక్కసారి ట్రాన్స్ లో నుంచి బయటికి వచ్చి లేదు అన్నట్టు తలలు మాత్రమే ఆడించారు అంతే…

 

అక్కడ కింద పడి ఉన్న చిన్న కత్తి తీసుకుని విసురుతాడు …అతను…

 

అక్కడ గార్డెన్ లో చెట్టు వెనకాల దాక్కొని ఉన్న వాడి గుండెల్లో దిగింది….

 

పొత్తుమని నెలను తాకాడు…. 

 

ఎవరు అంటారు…ఇంతకి…🤔

 

ఎలా ఉన్నాడు అర్జున్….

 

comment on story….

 

కామెంట్ ఇచ్చేసేయండి దోస్తులు….🙎❤️

ఫాలో కూడా చేసేయండి…🏃‍♀️🏃

 

comment must bigulu ✍️✍️

 

 

please give me your support and quality reviews…🙏

 

 

 

                ✍️ మీ Neeru’s ” RAM “