అర్జున్ – 4
అర్జున్ -4
ధరణి: బావ, మే ఐ కమ్ ఇన్. లోపలకి రావచ్చు ఆ బావ?
అర్జున్: ఏం అన్నావు? మళ్ళీ పిలువు.
ధరణి: బావ అని. అది సరే కానీ, ఏంటి ఇందాక అందరి లెక్కలు తెలుస్తా అంటున్నావ్? ఎవరి గురించి?
అర్జున్: అమ్మో, ఇప్పుడు ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ. (బయటకు మాత్రం) అబ్బే, ఏం లేదు ధరణి ఏదో ఫ్రెండు తో గేమ్ గురించి డిస్కస్ చేస్తున్న అంతే. అది సరే కానీ ఈ కప్బోర్డ్ తాళం ఎక్కడ?
ధరణి: అక్కడ ఏ ఉంది కప్బోర్డ్ లో. అది సరే, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావ్?
అర్జున్: ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న. నువ్వు ఏం చేస్తున్నావ్?
ధరణి: ఏం చేయడం లేదు, డిగ్రీ ఐపోయింది సో ఇంట్లో నే ఉన్నా బావ.
అర్జున్ (మనసులో): ఇప్పుడు ఆ శివ గురించి అడగాలా వద్ద? అడిగితే ఏం అనుకుంటుంది….. ధరణి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అమ్మ కి ఫోన్ చేయాలి.
ధరణి: నీ ఫోన్ ఉంది కదా బావ.
అర్జున్: ఛార్జింగ్ లో ఉంది. నిది ఇవ్వు మాట్లాడి ఇస్తాను. ఒక హాఫ్ ఆన్ హౌరా లో.
ధరణి: అంతసేపు ఏం మాట్లాడుతావు బావ?
అర్జున్: అమ్మ తో ఎంతసేపు మాట్లాడినా సరిపోదు లే, ఫోన్ ఇవ్వు.
ధరణి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోగానే అర్జున్ డోర్ లాక్ చేసి…..
ఇప్పుడు ఆ శివ గాడి గురించి తెలుసుకోవాలి అని లాప్టాప్ ఓపెన్ చేసి ఆ శివ నంబర్ ఎంటర్ చేస్తాడు. వాడు ధరణి కి చేసిన మెసేజెస్ ఓపెన్ చేస్తాడు. నేను ఏదో అనుకున్న కానీ, ఇంత వేస్ట్ గాడు లా ఉన్నాడు వీడు. ఫస్ట్ విడి ఫోన్ ట్రేస్ చేయాలి.
………………………..
ధరణి: బావ, డోర్ ఓపెన్ చేయి నీకోసం నీ ఫ్రెండ్ కార్తీక్ అంట వచ్చాడు .
అర్జున్: సరే, పద వస్తున్న…
కార్తిక్: హాయ్, రా అర్జున్ అని హాగ్ చేసుకుంటాడు.
అర్జున్: బైక్ తీసుకొని వచ్చావు కదా? పద బయటికి వెళదామా. అని మావయ్య నేను అలా బయటకి వెళ్ళి వస్తాను.
………………………………………………………..
శివ: సార్, ఆ అర్జున్ గాడు వచ్చాడా? వెళ్తా, ఆ అర్జున్ గాడు మీకు. ధరణి నాకు.
బాస్(బి): ఆ అర్జున్ గాడు ఎక్కవ చేస్తే అక్కడ ఏ నరికి పరేయండి వాడిని. అండ్ జాగ్రత్త వాడిని నువ్వు తక్కువ అంచనా వేయకు. నువ్వు అనుకున్నంత వీక్ కాదు వాడు. చాలా డేంజర్.
శివ: ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పని చేసే వాడికి అంత బిల్డప్ ఎందుకు సార్?
బాస్(బి): అయిన వాడి గురించి నీకు తెలీదు జాగ్రత్త. నువ్వు ఏ మాత్రం అజాగ్రత్త గా ఉన్నా వాడి చేతిలో చస్తావ్ నువ్వు. మా ముగ్గురి జీవితం నీ చేతిలో ఉంది. ఎందుకు అంటే వాడు ఎప్పుడూ ఏం చేస్తున్నాడు అని, ఏం ప్లాన్స్ వేస్తున్నాడు మాకు నువ్వు తెలియ చేయాలి. కొంచం అటు ఇటు అయిన అంతే సంగతులు.
శివ: అలాగే సార్.
………………………………………….
శేఖర (బాధపడుతూ): ఏంటి లక్ష్మీ వాడు అసలు నన్ను ఎందుకు అంత ద్వేషిస్తునాడు. నేను ఏం తప్పు చేశా?
లక్ష్మీ: ఏం కాదు అండి. వాడి గురించి మీకు తెలియంది కాదు కదా!
శేఖర్: మనం కూడా అనంతగిరి వెళదామా? అసలు వాడి గురించి మనకి తెలిసింది ఏ కదా? కోపం వస్తె వాడు మనిషి లాగా ప్రవర్తించాడు. మనం వెళ్దాం పద.
లక్ష్మీ: వద్దు అండి. వాడి కోపం గురించి అన్నయ్య కి తెలుసు లెండి. మనం వెళ్తే అన్నయ్య కి కోపం వస్తుంది.
శేఖర్: సరే, అలాగే. కానీ ఏదో ఒక రోజు వెళ్ళాలి కదా.
……………………………………..
కార్తీక్: ఏంటి రా? ఆ శివ గాడి గురించి ఏం అయినా తెలిసిందా నీకు.?
అర్జున్: ఆ తెలిసింది ధరణి అమ్మ ఇంకా నాన్న ఆ శివ గాడికి ఇచ్చి పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు. అది ఆపాలి.. సరే, రా ఆ కారు తీసుకొని నువ్వు వెళ్ళు.
కార్తీక్: అది, సరే రా. ధరణి విషయం ఏం చేస్తున్నావ్ రా? ఆ పెళ్ళి ఎలా ఆపేస్తావు నువ్వు?
అర్జున్: అదే, ఆలోచిస్తున్నా రా.
ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్……….
ధరణి: బావ, ఈ ఊరు ఎలా ఉంది?
అర్జున్: రోడ్లు చూస్తే భయం వేస్తుంది. కానీ కొందరిని చూస్తే ఇంకా భయం వేస్తుంది.
ధరణి: ఎవరిని?
అర్జున్: లాంగ్ రూట్లో తీసుకెళ్లే వాళ్లని.
ధరణి: అంటే ఇంకా కోపంగానే ఉన్నావా?
అర్జున్: నేనా? అస్సలు కాదు. కానీ ఒక గంట నడిపించిన విషయం మాత్రం గుర్తుంది ధరణి…..
To be continued……………….
Don’t forget to leave a comment …….
Swipe left/right or tap the sides to turn pages