New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసా మాట వినవే – 5

మనసా మాట వినవే – 5

                                పార్ట్…5

 

” అవును ” అంది తల దించుకుని.

 

ఎప్పటి నుండి అనగానే ” చిన్నప్పటి నుండి. కానీ నీకు నేను అంటే ప్రేమ లేదు అని చెప్పకుండా ఆగిపోయా ” 

 

ఆ మాట వినగానే సిద్దు క్లాప్స్ కొడుతూ ” వాహ్ ఏం ప్లాన్ చేశారే. నీకు నేను అంటే ఇష్టం అని తెలుసుకుని శ్వేత నీ సైడ్ చేసి నీతో పెళ్లి చేశారు కదా ” అన్నాడు.

 

శ్యామ్ కళ్ళ నీళ్లతో ” లేదు బావ మేము ఎందుకు అలా చేస్తాం ” అంది.

 

” చేస్తారు. ఎంత అయినా ముద్దుల కోడలివి కదా. నీకోసం ఏమైనా చేస్తారు. నేను పిచ్చి వాడిలా నిన్ను నమ్మి నా ఫ్రెండ్ అనుకుని మోసపోయా “

 

” అలా అనకు బావ నాకు ఏడుపు వస్తుంది “

 

” చేసింది అంత చేసి, నన్ను బాధ పెట్టీ, ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావు ఎంటే. ముందు నువ్వు నన్ను బావ అని పిలవడం ఆపెయి “

 

” నీతో మాట్లాడకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా బావ ” అంది గొంతు బొంగురు పోతుంటే.

 

” నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది ” అంటూ వెళ్లి మౌనంగా బెడ్ పై పడుకున్నాడు.

 

శ్యామ్ ఏడుస్తూ పాల గ్లాస్ కింద పడేసి అక్కడి నుండి బయటకి  పరిగెత్తు కుంటు వెళ్ళిపోయింది.

 

అలా ఎంత దూరం వెళ్లిందో తనకే తెలీదు. ఒక చోట ఆగి రోడ్డు మధ్యలో ఒంటరిగా మోకాళ్ళ పై కుర్చుని తన బాధ అంతా కన్నీళ్ళ రూపంలో బయటకి వస్తుంటే ఏడుస్తూ ఉండిపోయింది.

 

కాసేపటికి లేచి కళ్ళు తుడుచుకుని అక్కడ ఉన్న స్తంబం దగ్గరే కూర్చుని, స్తంబానికి తల ఆన్చి గుండెలోని బాధ కన్నీళ్ళ రూపంలో బయటకి వస్తుంటే సున్యంలోకి చుస్తు కూర్చుంది.

 

ఎవరో వచ్చి తన ముందు బైక్ ఆపడంతో అప్పటి వరకు పరధ్యానంలో ఉన్న శ్యామ్ బైక్ వంక చూసింది.

 

ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు బాగా తాగినట్లు ఉన్నారు అని వాళ్ళ వాలకం చూస్తేనే తెలిస్తుంది.

 

ఒంటరిగా శ్యామ్ అక్కడ ఉండడం చూసి తన ముందు బైక్ ఆపారు.

 

అందులో ఒకడు ” పోరి మస్తు ఉంది మామా. చూస్తుంటే ఫస్ట్ నైట్ నుండి పారిపోయి వచ్చినట్టు ఉంది. ఏం పాప నీ మొగుడు నచ్చలేదా. పోనీ మాతో వస్తావా. ఎంత కావాలంటే అంతా దోరుకుంతుంది ” అన్నాడు.

 

శ్యామ్ కోపం తో వాడి చెంప చెళ్లుమనిపించి ” నాటకాలు ఆడితే చంపి పడేస్త. పోండి ఇక్కడ నుండి ” అని ముందుకు వెళ్తుంటే

 

వెంటనే ఇంకొకడు బైక్ దిగి శ్యామ్ చెయ్యి పట్టుకున్నాడు.

 

” ఏయ్ చెయ్యి వదలరా ” అంటూ విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాడి బలం ముందు విడిపించుకోలేక కోపంతో వాడిని గట్టిగా తోయగానే కింద పడిపోయాడు వాడు.

 

వాడి ఫ్రెండ్ నీ అలా కింద పడేయడం తో వచ్చి లేపి ” ఎంత పోగరే నీకు ” అంటూ వచ్చి శ్యామ్ చేతులని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు.

 

” రేయ్ మామ దిని పొగరు నువ్వే దించు రా ” అనగానే కింద పడిన వాడు శ్యామ్ ముందు వచ్చి నిల్చున్నాడు.

 

” మర్యాదగా వదలండి లేదంటే ” అంటూ శ్యామ్ ఎంత గింజుకున్నా విడిపించుకొలేక పోతుంది.

 

” చాలా అందం గా ఉన్నావు. అందుకే కదా నీకు ఇంత పొగరు. ఆ పొగరు నే ధించుతా. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ” అని శ్యామ్ నీ కింద నుండి పై వరకూ చూసి తన నడుము దగ్గర వాడి చూపు ఆగింది.

 

” హా ఇక్కడ నుండి మొదలు పెడుతా ” అంటూ వాడి చెయ్యి శ్యామ్ నడుము దగ్గరకి తీసుకుని వచ్చాడు.

 

” వదిలేయండి ప్లీజ్ ” అంది శ్యామ్.

 

” ఇప్పటి వరకు చంపేస్తా అది ఇది అన్నావు ఇప్పుడు ఏమైంది ”  అంటూ శ్యామ్ నడుము పట్టుకోబోయాడు.

 

ఇంక ఒక్క సెకండ్ ఉంటే పట్టుకుంటాడు అనగా వాడి చెయ్యి నీ ఇంకో చెయ్యి ఆపింది.

 

ఎవరా అని చూస్తే అక్కడ సిద్దు నిలబడి ఉన్నాడు. సిద్దు నీ చూడగానే శ్యామ్ కి ధైర్యం వచ్చింది.

 

శ్యామ్ నీ పట్టుకోబోయిన వాడు ” ఏరా పెద్ద హీరో లాగా బిల్డప్ ఇస్తున్నావు. మర్యాద గా ఇక్కడ నుండి వెళ్లు ” అని మళ్ళీ శ్యామ్ వైపు వెళ్ళాడు.

 

అలా వెళ్తున్న వాడి చెయ్యి పట్టి వెనక్కి లాగి అలాగే వెనక్కి మెలి పెట్టాడు.  వాడు నొప్పితో అరుస్తూ ఉంటే అలాగే రిబ్స్ దగ్గక ఒక పంచ్ ఇవ్వగానే కింద పడ్డాడు వాడు.

 

శ్యామ్ నీ వెనక నుండి పట్టుకున్న వాడి రెండు చేతులు పట్టుకుని తన తలతో గట్టిగా వాడి తలని కొట్టాడు. దెబ్బకి వాడు ఆకాశంలో  నక్షత్రాలులో ఒక రౌండ్ వేసి కింద పడిపోయాడు.

 

కాసేపు తరువాత ఇద్దరు లేచి సిద్దు నీ కోపంగా చుస్తు వాళ్ళ దగ్గర ఉన్న కత్తులని బైటకి తీశారు.

 

వాటిని చూడగానే శ్యామ్ భయపడి ” బావ వెళ్ళిపోదాం రా. నాకు బయం వేస్తుంది ” అంది.

 

అయినా సిద్దు తన మాటలను పట్టించుకోకుండా వాళ్ళ వంక చూస్తున్నాడు.

 

ఇద్దరు చెరో వైపు సిద్ధుని రౌండప్ చేశారు. ఒకేసారి ఇద్దరు దాడి చేశారు. వారి నుండి తప్పించుకుంటూ తిరిగి వాళ్ళని కొడుతున్నాడు సిద్దు. 

 

అలా ఒకడిని కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇవ్వడంతో వాడు దూరంగా పడ్డాడు.

 

ఇంక మిగిలిన వాడిని చూస్తూ ” రా పొడుస్తవా. వచ్చి పొడిచేయి ” అంటూ వెళ్లి వాడి దగ్గర ఉన్న కత్తిని పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలు పెట్టాడు.

 

సిద్దు వాడిని కొడుతూ కింద పడిన వాడి సంగతి మరిచి పోవడంతో వాడు అదే అదునుగా పైకి లేచి సిద్దు వెనక వెళ్లి కత్తి పట్టుకుని నిల్చున్నాడు.

 

సిద్దు వంక కోపంగా చుస్తు కత్తితో వెనక నుండి పొడిచాడు.  కానీ సిద్దుకి ఏం కాలేదు.

 

” హా….. బావ ” అని శ్యామ్ అన్న మాట వినపడగానే వెనక్కి తిరిగి చూసాడు సిద్దు.

 

శ్యామ్ తన చేతితో కత్తిని గట్టిగా పట్టుకుంది. వాడు పొడవడానికి వెళ్ళినప్పుడు శ్యామ్ వాడి వెనకే వెళ్లి సిద్ధుని పొడిచే సమయానికి తను ఆ కత్తి నీ పట్టుకుని ఆపింది.

 

అలా ఆపడం వల్ల తన రెండు చేతులు కట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. నొప్పికి బావ అంటు అరించింది.

 

శ్యామ్ నీ అలా చూడగానే సిద్దు ఆ కత్తి పట్టుకున్న వాడిని గట్టిగా ఒక్క తన్ను తన్నడంతో వాడు కింద పడి ఆ రక్తం చూసి భయంతో వాడి ఫ్రెండ్ నీ తీసుకుని త్వర త్వరగా బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

 

 

సిద్దు వెంటనే శ్యామ్ చెయ్యి పట్టుకుని ” నీకు ఏమైనా మెంటలా. ఈ టైం లో ఇలా బయటకి వస్తారా. నేను రాకపోయి ఉంటే ఏం జరిగేది ” అన్నాడు తన హ్యాండ్ కర్చీఫ్ శ్యామ్ చేతికి కడుతూ.

 

అయినా శ్యామ్ ఏం మాట్లాడకుండా సిద్దు వంక అలాగే చుస్తు ఉంది.

 

బావ అంది  నీరసంగా. 

 

” ఎంటి ” అన్నాడు తనని వదిలి.

 

” నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పడిపోతున్నా, నా పైన కోపం ఉంది అని పట్టుకోకుండ ఉండకు ప్లీజ్ ” అంటూ అలాగే కింద పడిపోయింది.

 

సిద్దు వెంటనే శ్యామ్ నీ పట్టుకున్నాడు. అంత కోపంలో కూడా తనకి నవ్వు వచ్చింది శ్యామ్ మాటలకి. 

 

తనని అలాగే చూస్తు ” ఇంత అమాయకంగా ఉంటావు. అలా ఎలా చేయగలిగావే. శ్వేత ఏమైంది అసలు. మీరే ఏమైనా చేశారా. తనని పట్టుకుంటుంటే కానీ ఈ విషయాలు ఏవీ తెలియవు ” అంటూ శ్యామ్ నీ ఎత్తుకుని ఇంటి కి వెళ్లి బెడ్ పై పడుకోబేట్టాడు.

 

డాక్టర్ కి కాల్ చేసి రమ్మన్నాడు. అర్ధ గంట తరువాత డాక్టర్ వచ్చి శ్యామ్ చేతులకి కట్టు కట్టి, మెడిసిన్స్ రాసి ఇచ్చి వెళ్ళిపోయారు.

 

సిద్దు అక్కడే ఉన్న సోఫా లో పడుకుని మొదటి సారి తను శ్వేత నీ కలిసిన రోజు గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.

 

రెండు సంవ్సరాలక్రితం సిద్ధూ, శ్యామ్ ఇద్దరు కలసి కాఫీ తాగుతూ ఉండగా ఒక లెటర్ గాలికి వచ్చి సిద్దు ముందు పడింది. 

 

దాన్ని తీసుకుని ఎంటి అని చూసాడు. అందులో

 

ఎటు చూసినా నువ్వే

కళ్ళు మూసినా నీ కలలే

కంటి పాపలోనూ నీ ప్రతిబింబమే.

 

నా యదలో చేరి తియ్యగా,

వేధించే నీ తలపులు.

 

నా మనసుని ఒక్క క్షణం కూడా

కుదురుగా ఉండనివ్వని నీ మాటల సవ్వడి.

 

నా శ్వాస తో జత కలిపిన నీ శ్వాస,

నా అణువణువునీ ఆక్రమించుకున్న నీ ప్రేమ.

 

జన్మ జన్మలకు నువ్వే కావాలంటున్న ఈ నా పిచ్చి మనసు,

ఈ జన్మకి ఇవి చాలవా ప్రియతమా……..

 

అని ఉంది ఆ లెటర్ లో. అది చూసి సిద్దు ” వావ్ ఎంత అందంగా ప్రపోజ్ చేశారు. ఎవరు రాశారు ఈ లెటర్ ” అంటూ చుట్టూ చూసాడు.

 

” ఎంటి బావ అది. ఏం ఉంది అందులో ” అంది శ్యామ్.

 

” ఎవరో వాళ్ళ లవర్ కోసం కవిత రాశారు అనుకుంటా. చాలా బాగుంది తెలుసా శ్యామ్ ” 

 

” నీ కవితల పిచ్చి ఎంటో నీకే తెలియాలి “

 

” పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన ” అన్నాడు వెంటకరంగా.

 

” అంటే నేను పంది నా ” అంది కోపంగా.

 

” అదే గా అన్నాను. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలా “

 

” అవును లే బావ ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గు కావాలని వచ్చాడు అంట ఒకడు ” అంది.

 

సిద్దు శ్యామ్ వంక చూసి ” మెంటల్ ఇప్పుడు ఆ డైలాగ్ కి సిట్యుయేషన్ కి ఏమైనా సంబంధం ఉందా ” అన్నాడు.

 

” నువ్వు అన్నావ్ నేను అన్నాను చెల్లుకు చెల్లు. సంబంధం ఉంటే ఎంటి లేకపోతే ఎంటి. నువ్వో కవితల పిచ్చొడివి ”  అని ఎదో చెప్పే లోపు

 

” హేయ్ పే ” అంటూ చుట్టూ చూస్తున్న సిద్ధుకి అక్కడ వేరే టేబుల్ దగ్గర శ్వేత వాళ్ళని చూస్తూ కనిపించింది.

 

సిద్దు తనని చూడగానే అటు వైపు తిగింది. సిద్దు లేచి వెళ్ళి శ్వేత ముందు కూర్చున్నాడు. 

 

ఆ లెటర్ నీ శ్వేత ముందు పెట్టీ ” మీరు చాలా బాగా రాశారు అండి ” అని చెప్పాడు.

 

తను నవ్వి ఊరుకుంది. మీరు ఏం అనుకోను అంటే ఈ లెటర్ నీ నేను తీసుకోవచ్చా అని అడిగాడు.

 

దానికి కూడా నవ్వి ఊరుకుంది. ” ఇంతకీ మి పేరు “

 

” శ్వేత ” అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎదో కాల్ రావడంతో.

 

సిద్దు మళ్ళీ శ్యామ్ దగ్గరకి వచ్చి ” శ్వేత నైస్ నేమ్ కదా ” అన్నాడు.

 

శ్యామ్ కోపంగా ” అంత నచ్చిందా అది. చొంగ కార్చుకుంటూ చూస్తున్నావు ” అంది.

 

” తను బావుంది. అంత కంటే ఈ లెటర్ బాగుంది ” అన్నాడు దాన్ని తన పర్స్ లో పెట్టుకుంటు.

 

అలా మరుసటి రోజు శ్యామ్, సారిక తో కలసి   షాపింగ్ కి వెళ్ళిన రోజు మాల్ లో మళ్ళీ కనిపించింది శ్వేత.

 

అలా రెండు, మూడు సార్లు కనిపించడంతో వారి పరిచయం ప్రేమగా మారింది.

 

అదంతా ఆలోచిస్తూ ” ఏక్కడ ఉన్నావు శ్వేత. ఏమై పోయావు ” అని అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

 

తెల్లవారగానే లేచి కూర్చుంది శ్యామ్. సోఫా లో నిద్ర పోతున్న సిద్దు నీ చూసి చిన్నగా నవ్వుతూ రాత్రి జరిగింది గుర్తు రాగానే తన చేతుల వంక చూసుకుంది.

 

బ్యాండేజ్ వేసి కట్టు కట్టి ఉండడం చూసి హ్మ్మ్ అని నిట్టూరుస్తూ శబ్ధం చేయకుండా లేచి కిందకి వెల్లింది.

 

కిచెన్ లోకి వెళ్లి స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. చెయ్యి కట్ అవ్వడం తో నెప్పి పెడుతున్నా కూడా అలాగే కాఫీ కలిపి కొన వేళ్ళతో జాగ్రత్తగా పట్టుకుని గదిలోకి వెళ్లింది.

 

” బావ ” అని పిలిచింది. అయినా సిద్దు లేవలేదు. 

 

” బావ లే ” అనగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా శ్యామ్ కాఫీ కప్ తో నవ్వుతూ నిలబడి

” తీసుకో  బావ కాఫీ ” అంటూ సిద్దు ముందు పెట్టింది.

 

సిద్దు కోపంగా దాన్ని పక్కకి విసిరి కొడుతూ ” నీ కాఫీ లు, గిఫీ లు నాకు ఏం వద్దు. ముందు నువ్వు నాకు దూరంగా ఉండడం నేర్చుకో ” అంటూ లేచి బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.

 

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

To be continued…………

 

స్టోరీ ఎవరికి నచ్చడం లేదు అనుకుంటా. చదివి సైలెంట్ గా వెళ్లిపోతున్నారు.