New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 40
అజేయ Premium 4 min read

అజేయ – 40

**   అజేయ  –  40 **

 

 

“యెస్ మై సెనోరిటా ! నువ్వు గీసిన ఈ పిల్లర్స్ మీద ఉన్న సింహం చెక్కడాలు, ఈ రాతి కట్టడాల శైలి… ఇవన్నీ 12వ శతాబ్దపు లేట్ చాళుక్య అండ్ కాకతీయ ఆర్కిటెక్చర్ కి మ్యాచ్ అవుతున్నాయి..

 

ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, నల్లమల అడవుల మధ్య ఉన్న అహోబిలం పరిసర ప్రాంతాల శిథిలాలలో సరిగ్గా ఇలాంటి ఆకృతులే ఉన్నాయి…

 

అక్కడ కొన్ని శతాబ్దాల నాటి అండర్ గ్రౌండ్ టెంపుల్స్, పాత కోట బురుజులు దట్టమైన అడవిలో దాగి ఉన్నాయి, థెయ్ ఆర్ మోర్ కాంఫిడెన్షియల్ ప్రిన్సీ ” అని చెప్పింది..

 

సియా.. శృతి చూపిస్తున్న ఆ ఫోటోల వైపు రెప్పవాల్చకుండా చూస్తుంది… ఆ ఫొటోస్ చూస్తున్న కొద్దీ సియా హార్ట్ బీట్   మళ్ళీ పెరిగింది..

 

తన కలలో వచ్చే ఆ దట్టమైన అడవి, ఆ భయంకరమైన యుద్ధభూమి… అన్నీ ఆ అహోబిలం పరిసర ప్రాంతాలే అని శృతి మాటల ద్వారా తనకి మళ్ళీ ఒక సాలిడ్ ప్రూఫ్ దొరికింది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue