New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అర్జున్ – 5

అర్జున్ – 5

అర్జున్ -5

 

 

ధరణి కి శివ నుండి కాల్ వస్తుంది. ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడదాం అని అనుకొనే లోపు, ధరణి అని అర్జున్ పిలుస్తాడు. ఫోన్ అలాగే లైన్ లోనే పట్టుకొని వెళ్తుంది.

 

ధరణి: వస్తున్న బావ. 

 

అర్జున్: అలా బయటకి వెళదామా? ఇంట్లో ఉండి బోర్ కొట్టడం లేదు ఆ? పద అలా బయటకి వెళ్ళి వద్దాం?? 

 

ధరణి: ఐదు నిమిషాలు బావ వస్తాను అని చూసుకోకుండా ఫోన్ అక్కడ పెట్టీ వెళ్ళిపోతుంది. 

 

ఆ విషయం శివ వింటాడు.

 

శివ: ఏంటి, ఇది ఆ అర్జున్ గాడితో వెళ్తుంది. చూస్తా ఆ ధరణి కథ. ఆ అర్జున్ గాడి కథ…

 

అర్జున్ (మనసులో): నాకు తెలుసు ఆ శివ గాడు విని ఉంటాడు. నాకు కావలిసింది అదే లే. ఎంత త్వరగా వస్తె అంత మంచిది..

 

………………………….

 

 

సంధ్య: ఎక్కడకి ధరణి రెడీ అవుతున్నావ్??

 

ధరణి: అర్జున్ బావ నన్ను బయటకి తీసుకుని వెళ్తా అన్నాడు అమ్మ.

 

సంధ్య: సరే, వెళ్ళు జాగ్రత్త. వాడికి కోపం ఎక్కువ వాడికి కోపం తెప్పించే పనులు చేయకు. కొడతాడు వాడు ఎవరు అని కూడా చూడడు. శివ గురించి ఏం ఆలోచించావ్.?

 

ధరణి: నేను నీకు చెప్పాను కదా అమ్మ. శివ అంటే నాకు ఇష్టం లేదు అని.

 

…………………….

 

 

అర్జున్: ధరణి రా త్వరగా. బైక్ ఎక్కు.

 

ధరణి బైక్ ఎక్కి అర్జున్ పైన హ్యాండ్ వేస్తుంది. అర్జున్ ఒకసారి వెనక్కి చూస్తాడు.

 

ధరణి: సారీ, బావ అని హ్యాండ్ వెనక్కి తీసుకుంటూ ఉంటే. 

 

అర్జున్ పట్టుకొని పర్లేదు ధరణి ఉండనివ్వు అంటాడు.

 

ధరణి: బావ, ఓక విషయం అడగాలి మిమ్మలిని. 

 

అర్జున్: అడుగు, నా దగ్గర మొహమాటం ఏంటి అని అంటూ. చూసుకుండా బ్రేక్ వేసే సరికి ధరణి ఒకసారిగా మీద పడుతుంది.

 

ధరణి: సారీ, బావ. అని కొంచం సేపు ఆగి………..

అయినా నీకు కోపం ఎక్కవ అంట కదా. కోపం వస్తె ఎవరు అని కూడా చూడకుండా కొడతావు అంట కదా? నిజం ఆ?

 

అర్జున్: అత్తయ్య చెప్పింది ఆ? అవును నిజం ఏ కానీ, ఎప్పుడో రేర్ గా ఆలా కోపం వస్తుంది అంతే. మిగతా టైమ్ లో నేను చాలా సరదాగ ఉంటా ధరణి.

 

ధరణి: ఎక్కడకి తీసుకొని వెళ్తున్నావ్ బావ నన్ను??

 

అర్జున్: ఆ….. కిడ్నాప్ చేయడానికి. మొన్న ఊరు అంత తిప్పించావ్ కదా! కిడ్నాప్ చేసి దానికి రివెంజ్ తీసుకోడానికి తీసుకొని వెళ్తున్న మరదలా. కాసేపు, ఆగలేవ తీసుకొని వెళ్ళే వరకు.

 

ధరణి: ఏంటి? బావ ఇక్కడ అపావు అని అడిగితే…….

 

అర్జున్: చిన్న షాపింగ్ చేయాలి షర్ట్స్ కొనాలి. అదే ఇంటి దగ్గర అయితే అమ్మ సెలెక్ట్ చేసేది. ఇక్కడ ఎవరు లేరు కాదా. సో, నిన్ను తీసుకొని వచ్చా.

 

ధరణి: బావ, ఈ బ్లాక్ కలర్ బాగుంటుంది నీకు. ఇది తీస్కో. 

 

అర్జున్: ఓకే మేడమ్.ఇక్కడ ఏ ఉండండి ట్రైల్ వేసి వస్తా అంటాడు.

 

ధరణి: బావ చాలా బాగున్నావ్ ఈ షర్ట్ లో. సూపర్ గా ఉన్నావ్…….

 

అర్జున్: ఓకే పద. ధరణి ఈ చీర నీకు బాగుంటుంది చూడు అని అడిగితే….

 

లేదు, బావ నాకు వద్దు. అని అంటుంది ధరణి..

 

అర్జున్: ఈ చీరకి ఇంకా షర్ట్ కి రెండింటి కి బిల్లు వేయండి అని బిల్ పే చేసి తీస్కో ధరణి అని కవర్ ఇస్తాడు.

 

 

బావ, నాకు వద్దు అని అనబోతు ఉంటే, ధరణి తీస్కో ముందు అని చెయ్యి పట్టుకొని బైక్ దెగ్గరకు వెళ్తాడు. అర్జున్.

 

 

అర్జున్: ధరణి నువ్వు ఎవరిని అయిన లవ్ చేశావా??

 

ధరణి: చేశానంటే?

 

అర్జున్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఏంటి నిజంగానా? చేసావా?

 

ధరణి నవ్వేసింది. భయపడ్డావా బావ?

 

అర్జున్: నేనా? అస్సలు కాదు.

 

ధరణి: నీ మొహం చూస్తే అర్థమవుతుంది. అది సరే, ఎందుకు బావ అలా అడిగావు??

 

అర్జున్: ఏం లేదు, లవ్ చేసి ఉంటే మాత్రం ఆ చీర కొని ఇచ్చి కదా! మళ్ళీ మీరు లవ్ చేసిన పర్సన్ నన్ను ఏం అయినా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ధరణి. అసలు ఏ మా అమ్మ కి నేను ఒకడినే కొడుకు నీ. నేను లేకపోతే మా మామ్ ఉండలేదు. అనే సరికి ధరణి చిన్న స్మైల్ ఇస్తుంది.

 

 

అర్జున్: ఇంతకు శివ ఎవరు??

 

ధరణి (తడబడుతూ): బావ అది నాకు వాడు అంటే ఇష్టం లేదు. కానీ, అమ్మ నే పెళ్ళి చేస్కో వాడిని అంటుంది. 

 

అర్జున్: పోనీ, చేసుకోవచ్చు కదా?

 

ధరణి: వాడు మంచివాడు కాదు బావ. నాతో చాలా సార్లు తప్పు గా బిహేవ్ చేశాడు 

 

అర్జున్ (మనసులో): హమ్మయ్య, ఎక్కడ ఈ ధరణి కి వాడు అంటే ఇష్టం ఏమో అని చాలా భయపడ్డ. మొత్తానికి వాడు అంటే ఇష్టం లేదు అన్నది కదా! ఇక చూస్తా వాడి సంగతి……..

 

To be continued…………..

 

Don’t forget to leave a comment………..