New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 165

మాంగళ్య బంధం – 165

అక్కడ తన గదిలో పడుకున్న ప్రతిమకు కూడా ప్రణయ్ గుర్తొస్తూనే ఉన్నాడు.. అసలు ఆయన నన్ను తలుచుకుంటారా..

 

నేను ఆయనకు చెప్పకుండా వచ్చేసాను అని కోపంగా ఉన్నారా.. లేదులే ప్రణయ్ గారు అలా ప్రతి చిన్న విషయానికి కోపగించుకునే మనిషి కాదు.. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు ..

 

ఏంటో రోజు ఆయనతో కలిసి ఒకే గదిలో పడుకోవడం అలవాటై, ఈరోజు నా గదిలో ఒంటరిగా పడుకోవాలి అంటే కొత్తగా అనిపిస్తుంది అనుకుంటూనే ఆమెకే తెలియకుండా ప్రణయ్ ని తలుచుకుంటూ నిద్రపోతుంది..

 

ఆ రాత్రి అలా గడిచి పోగా రోజుటి కంటే ముందుగానే శాంతి గారు  నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టి, ఆ ముగ్గుకి రంగులు అద్ది మరి కాస్త అందంగా మారుస్తారు..

 

తరువాత గబగబా స్నానం చేసి పూజ పూర్తి చేసి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి అలంకరిస్తారు..

 

అంతలో శేఖర్ గారు కూడా నిద్రలేచి రావడంతో  ఆయన గుమ్మాలకి కట్టడానికి మామిడి ఆకుల కోసం బయటకు వెళ్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue