New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 164

మాంగళ్య బంధం – 164

తల్లితండ్రులతో వెళ్లే ముందు ప్రతిమ యశోద గారి దగ్గరికి వెళ్లి  మీరు ఉదయాన్నే వచ్చేయండి అత్తయ్య.. ప్రణయ్ గారికి నా తరఫున చెప్పండి..

 

ఎందుకో ఆయన లేకుండా వెళ్లడం నాకేమీ బాగోలేదు.. ఆయన కూడా ఉండి ఉంటే ఆయనకు ఒక  మాట చెప్పి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి మరి వెళ్తుంది..

 

నిజంగానే ప్రతిమ కి ప్రణయ్ లేకుండా వెళ్లడం ఎందుకో ఆ క్షణం నచ్చలేదు.. తను అసలా ఎందుకు ఫీల్ అవుతుందో కూడా ఆమె గమనించలేదు కానీ పెళ్లయిన తర్వాత మొదటిసారి అతనితో కాకుండా ఒంటరిగా వెళ్లడం  కావడం తో ఆమెకి ఏదోలా అనిపించింది..

 

అయినా ఏమీ చేయలేదు కనుక మౌనంగా తల్లిదండ్రులతో పాటు వెళ్లిపోయింది.. కానీ వెళ్తున్న ప్రతిమ వంక చూసి యశోద గారు చాలా మురిసిపోతారు..

 

కోడలికి తన కొడుకుని వదిలి వెళ్లడం ఇష్టం లేదని, కొడుకు కి చెప్పి వెళ్లలేకపోతున్నందుకు బాధపడుతుందని  అర్థం చేసుకునే కోడలికి కొడుకు అంటే ఎంత ప్రేమ.. ఈ ప్రేమ జీవితాంతం అలానే ఉండాలి అని మనసులోనే కోరుకుంటారు..

 

తల్లిదండ్రులతో ఇల్లు చేరుకున్న ప్రతిమ బయటే కాళ్లు కడుక్కొని నేరుగా బ్యాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue