అబ్బా నువ్వు మరీ బావ నేనేదో ప్రతిమని వదిలేసి చాలా రోజులు ఉన్నట్టు చెప్తున్నావ్.. తను వెళ్ళింది రాత్రే కదా.. మళ్లీ ఈరోజు రాత్రికి మన ఇంటికి వచ్చేస్తుంది..
ఒక్క రోజుకే నువ్వు ఇన్నేసి మాటలు మాట్లాడాలా.. నేనేమీ మీ చెల్లెల్ని ఒంటరిగా పుట్టింటికి పంపించి నెలలు నెలలు ఉంచేయడం లేదులే ..
ఏం చేస్తాం నువ్వే చెప్పు బావ.. నాకు మాత్రం తనని ఒక్కదాన్నే పుట్టింటికి పంపించాలి అని ఉంటుందా.. కాకుంటే నా పనులు అలా ఉన్నాయి కాబట్టి పంపించాల్సి వచ్చింది అంతే..
వీలైనంతవరకు నేను మీ చెల్లెలు కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాను.. నువ్వు ఆ విషయంలో బెంగ పెట్టుకోకు. నేను మీ చెల్లెల్ని బాగానే చూసుకుంటాలే అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు ప్రణయ్..
హ్మ్ నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా నీ మాటకి విలువ ఇస్తానులే పద లోపలకి వెళ్దాం అంటూ బామ్మర్ది తో కలిసి లోపలకి నడుస్తూనే ఓయ్ నిజం చెప్పు మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా..
ఆరోజు ఏదో అన్నావు .. ప్రతిమ కి పెళ్లి ఇష్టం లేకుండా చేసుకుంది అది ఇది అని.. నీకు ఇప్పటికి కూడా అలానే అనిపిస్తుందా?ప్రతిమ నీతో బావుందా లేదా అని అనుమానంగా చూస్తూ అడిగాడు భరత్..