ఇప్పుడు నేనేమన్నాను?? అంది భయపడుతూ
అంతా నీఇష్ట ప్రకారమే జరగాలా?? అంత ఈజీగా వేరే వాళ్ళని తక్కువ ఎలా చేస్తావు???
ఎదుటివాళ్ళు ఫీలవుతారు?? అన్న కామన్ సెన్స్ లేదా?? లేక ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే తెలివైన దానివి…
మిగతావాళ్ళందరూ పిచ్చివాళ్లు అనుకుంటున్నావా?అని అడిగాడు చాలా సీరియస్ గా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ
తను ఆ మాట ఎందుకు?? అంటున్నాడో ??ప్రాప్తికి అర్థంఅయింది తన దగ్గర ఎలాంటి సమాధానం లేదని తలంచుకుంది…
చెప్పు చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతావు కదా? నేను అడిగినదానికి ఒక్కదానికి సమాధానం చెప్పు…