హ్మ్ గుడ్ అంటూ బ్రహ్మిని చూస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇక్కడంత నీట్ గా క్లియర్ చేయించండి మూర్తి గారు అని వచ్చిన అతనికి చెప్పి పక్కకి వెళ్లి సిగరెట్ వెలిగిస్తాడు…
ఆ వ్యక్తి పక్కకు వెళ్ళిపోగానే బ్రహ్మి మూర్తి ని చూస్తూ అదేంటయ్యా అతను ఏం అడిగిన నోరు తెరిచి మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి పోతాడు అంటాడు విసుగ్గా…
ఇప్పుడు నీ బాధ ఏంటి బాబు ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది అనే కదా అని నవ్వుతాడు మూర్తి చిన్నగా….
మూర్తి నవ్వడం చూసి బ్రహ్మి చిరాగ్గా మొహం పెట్టి ఏందయ్యా నువ్వు కూడా అతనిలానే నవ్వుతున్నావ్ ఆ పిల్లని ఆ వెధవల నుండి కాపాడిండు అనుకునేలోపే హత్య కేసులో ఇరికించిండు..
ఆ పిల్ల జీవితం గురించి కొంచెం అయినా ఆలోచించినాడా అసలు గీ మర్డర్ విషయంగా పోలీసోళ్ళకి తెలిస్తే ఆ పిల్లని లాక్కెళ్లి జైల్లో పడేయరా ఎందుకు అలా చేసాడు హా అంటాడు కొంచెం కోపంగా..
ఆ అమ్మాయి జీవితానికి ఎటువంటి నష్టం జరగదు బాబు…మా సార్ ఎప్పటికి అలా జరగనివ్వడు కావాలంటే అటు చూడు అని బ్రహ్మి తల తిప్పి రాఖీ వాళ్ళని చంపిన ప్లేస్ వైపు చూపిస్తాడు మూర్తి ..