ఐస్క్రీమ్ తినొద్దు అని చెప్పాను కదా బేబీ… అయినా కూడా నువ్వు మళ్ళీ ఐస్క్రీమ్స్ తింటున్నావా? అని అడిగాడు..
ఇదే లాస్ట్ బావ ప్లీజ్ అంది కళ్ళు చిన్నవి చేస్తూ…
కృతి బావ అని పిలిచేది అప్పుడప్పుడు మాత్రమే… ఆ పిలుపుకి ఐస్క్రీమ్ లా మనసు కరిగిపోయి ఇదే లాస్ట్ టైం… మరోసారి తింటూ కనిపించిన తిన్నట్టు తెలిసినా అత్తకి చెప్పేస్తా అన్నాడు…
తిననులే అని చేతిలోని బాక్స్ లాక్కొని తింటుంటే ఏయ్! చిన్నపిల్లలా ఈ లాక్కొని తినడం ఏంటి?? కొంచెం డీసెంట్ గా బెహేవ్ చేయ్ కృతి అన్నాడు చిరాకు పడుతూ…