నా నిళా….! నువ్వు ఇంత పొద్దున్నే ఎందుకు లేచి వచ్చావు….!
వంటగది గుమ్మం దగ్గర నిలబడి వైధు కళ్లెర్రజేసి అడిగింది…!
నా వైధూ… ఇవన్నీ నాకు ఇష్టమైన పనులే కదా…. అని గారంగా అడిగిన ఆమె వైపు వైధు కళ్లెర్రజేసి చూసింది….
ఆ… అవును… ఇష్టమే కదా….! కానీ… ఈ… కడుపులో ఒక చిన్న బుజ్జి పాప ఉంది కదా…! దానికి ఇష్టం లేకపోతే ఏంటి… ఈ అమ్మ ఇలా పొద్దున్నే నిద్ర చెడగొట్టుకుని పని చేయడం….!
ఓహ్… నా వైధూ….! నువ్వు మరీ ఎక్కువగా ఏమీ ఆలోచించకు….! నా బుజ్జి అలాంటివేమీ ఆలోచించదు….! 😒
కొంచెం వెటకారంగా చెబుతూ ఆమె గదిలోకి నడిచింది….!