New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
CEO తో అనుకోని రాత్రి – 8

CEO తో అనుకోని రాత్రి – 8

లొకేషన్ మ్యాప్ ఆగిన చోట చూస్తే… చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. రిషిత అడ్రస్ ఉన్న ఆ ఇంటిని చూసి ఆర్య ఒక్క క్షణం అయోమయంలో పడిపోయాడు.

 

“ఇదేనా రిషిత ఇల్లు? ఇంత చిన్న ఇంట్లో ఉంటుందా?” అని డౌట్ వచ్చి, చేతిలో ఉన్న రెజ్యూమ్‌లోని ఇంటి నంబర్‌ని, గేటు మీద ఉన్న నంబర్‌ని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్నాడు.

 

అదే ఇల్లు అని కన్ఫర్మ్ అయ్యాక, ఆర్య తన BMW కారుని ఆ చిన్న ఇంటి గేటు ముందే ఆపాడు. కారు డోర్ తీసి, తన కోట్ సర్దుకుంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు.

 

లోపల మంచం మీద పడుకున్న రిషితకి బెల్ సౌండ్ వినిపించింది. కానీ ఒంట్లో ఓపిక లేక, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు అయ్యుంటారులే అని కళ్ళు తెరవలేదు.

 

బయట నిలబడ్డ ఆర్య రెండు మూడు సార్లు గట్టిగా బెల్ కొట్టాడు. అయినా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో, ఇంట్లో ఎవరూ లేరనుకుని పడుకున్న రిషిత… ‘ఈ టైంలో ఎవరబ్బా వచ్చింది?’ అనుకుంటూ భారంగా లేచింది.

 

 స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని ఉండటంతో, తన ఒంటి మీద ఉన్న ఆ గాట్లు బయటికి కనిపించకుండా మీద ఒక చున్నీ వేసుకుని, మెల్లగా నడుచుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue