New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 6

కడదాక నీతోనే ❤️‍🔥 – 6

ఆద్య : సరేలే మన కాలేజ్ అని సంబర పడకు నువ్వు ఏ అల్లరి వేషాలు వేసిన మన ప్రిన్సిపల్ గారు నాన్నకి మావయ్యకి చెప్తారు ….. ఇప్పటికన్నా మీ అల్లరి వేషాలు మాను మీ స్కూల్లో చేసినట్టు పిచ్చి వేషాలు వేస్తే నాన్నకి మామయ్యకి తెలిసిపోతుంది జాగ్రత్త మరి 

 

సాత్విక : సరేలే ఓయ్, తెలిసినప్పుడు కదా అప్పుడు చూసుకుందాం మన కాలేజీకి వచ్చి అందరిని నేనే ర్యాగింగ్ చేస్తాను అప్పుడు ఉంటుంది చూడు…….

 

ఆద్య : ఏయ్ ఆగాగు ఊహల్లో తేలిపోకు మన కాలేజీలో ర్యాగింగ్ ఉండకూడదని పాస్ చేశారు కదా మర్చిపోయావా సీనియర్ జూనియర్స్ తో ఇంట్రాక్ట్ అవ్వడానికి మాత్రమే ఉంటుంది అది కూడా నార్మల్గా ఎవరైనా ర్యాగింగ్ చేస్తే డిబాస్ చేస్తారు

 

సాత్విక  : అయితే నేనే చేస్తాను నన్ను ఎవరు అంటారు నేను కాలేజ్ కి వచ్చాక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగని నేనేమీ మితిమీరి చెయ్యనులే నాకు లిమిట్స్ తెలుసు…..అది సరే గానీ నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా నేను ఫస్ట్ ఇయర్ చూద్దాం ఎవరు ఫ్రెండ్స్ అవుతారో……

 

సరస్వతి గారు  : సాత్విక …..ఆద్య…… డిన్నర్ కి రండి

సరే అమ్మా వస్తున్నాం 

 

అందరూ డిన్నర్ కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue