❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 2
అంటూ డీన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వరూధిని ధైర్యం చేసి ముందుకు వచ్చి, “సార్, అతని ప్లేస్‌లో ఇంకెవరినైనా పంపిస్తే సరిపోతుంది కదా!” అని అంటుంది.
డీన్ మాట్లాడుతూ, “రుద్రవీర్ సింహ ఇంటికి వెళ్లేంత ధైర్యం ఇక్కడ ఎవరు చేస్తారు? ఏదైనా తేడా వస్తే ఆయన కోపాన్ని మనం భరించలేం.”
“వరూధిని, మనం ట్రీట్‌మెంట్ చేయడానికి వెళ్తాం . కానీ ఆయనకు కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తాం సార్? మన డ్యూటీ మనం చేసుకుని వస్తే సరిపోతుంది కదా! అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తే టైమ్ వేస్ట్ చేయడం తప్ప ప్రయోజనమేమీ ఉండదు” అంటుంది.
డీన్, “ఈరోజు వెళ్లాల్సిన డ్యూటీ డాక్టర్ రాలేదు కాబట్టి, అతని ప్లేస్‌లో ఇక్కడ డ్యూటీ చేసే డాక్టర్ ఎవరో కనుక్కోండి” అనగానే,
వరూధిని, “ఈరోజు మార్నింగ్ డ్యూటీ నాదే సార్” అని చెప్తుంది.
“అయితే మీరే వెళ్లిరండి. మిస్ వరూధిని, చాలా జాగ్రత్తగా ట్రీట్‌మెంట్ చేసి రండి. ఎక్కడా ఏ పొరపాటు జరగకూడదు. అర్థమైందా?” అని డీన్ అనగానే,
“ఓకే సార్” అని చెప్తుంది వరూధిని.
చుట్టూ ఉన్నవాళ్లు వరూధినిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రుద్రవీర్ సింహ గురించి తెలిసినవాళ్లు ఎవరూ సింహం నోటిలో తల పెట్టాలని అనుకోరు. అలాంటిది వరూధిని ఇంత ధైర్యంగా వెళ్తానని చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు.
పక్కనే ఉన్న వైష్ణవి వరూధిని చెయ్యి పట్టుకుని, “నీకు అసలు కొంచమైనా తెలివి ఉందా వరూధిని? పోయి పోయి ఆ ఇంటికి వెళ్తానంటున్నావ్! ఇప్పటివరకు ఆ ఇంటికి ట్రీట్‌మెంట్ చేయడానికి వెళ్లిన డాక్టర్స్ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. వాళ్లందరినీ ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారు కూడా తెలియదు.
బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అనవసరంగా ఇబ్బందుల్లో పడకు” అంటుంది.
వరూధిని, “అసలు మీరందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఒక మనిషిని చూసి ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? మనం చేయాల్సిన పని సవ్యంగా చేసి వస్తే సరిపోతుంది కదా!” అంటుంది.
వైష్ణవి, “నీ ఇష్టం తల్లి! నువ్వు ఎంత చెప్పినా వినవు. నీకు నచ్చిందే చేస్తావు. అలాంటప్పుడు నేను ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు . నువ్వు చేసేదే చేస్తావ్. సరే, బయలుదేరు. కానీ జాగ్రత్త! ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకు. నీ ట్రీట్‌మెంట్ అయిపోగానే సైలెంట్‌గా హాస్పిటల్‌కి వచ్చేసేయ్” అంటుంది.
వరూధిని, “అసలు ఏంటే మీ బాధ? ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు. అసలు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్. నేను వెళ్లి ట్రీట్‌మెంట్ చేసి, ఇలా వెళ్లి అలా వచ్చేస్తానో లేదో చూడు” అంటుంది.
“ఏమో తల్లి! నీ మీద నాకు నమ్మకం లేదు. ప్రతి విషయంలోనూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ లెక్చర్లు ఇస్తావు. దాని గురించే నా టెన్షన్ . ఏక్కడ ఏ గొడవ తెచ్చి నెత్తిమీద వేసుకుంటావో అని” నా భయం అంటుంది వైష్ణవి.
“ఇక నాకు లేట్ అవుతుంది. నేను వెళ్తున్నాను” అంటూ వరూధిని రఘునందన్ అనే పేషెంట్‌కి ట్రీట్‌మెంట్ చేయడానికి రుద్రవీర్ సింహ ఇంటికి వెళ్తుంది.
క్యాబ్‌లో వెళ్తూ, ఆలోచనలో పడుతుంది. వీళ్లెందుకు ఇంతగా భయపడుతున్నారు? ఒక పేషెంట్‌కి ట్రీట్‌మెంట్ చేయడానికి హాస్పిటల్ డీన్ కూడా వచ్చి టెన్షన్ పడేంత ఏముంటుంది? అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో క్యాబ్ రుద్రవీర్ సింహ మెన్షన్ ముందు ఆగుతుంది.
క్యాబ్ డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చేసి మెన్షన్‌ని చూస్తుంది. చాలా పెద్దగా, చుట్టూ బాడీగార్డ్స్‌తో టైట్ సెక్యూరిటీ మధ్య ఆ మెన్షన్ ఉంటుంది.
గేటు దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ దగ్గర తన ఐడీ చూపించి లోపలికి వెళ్లాలని అడుగుతుంది.
“ఒక్క నిమిషం మేడం” అంటూ లోపల ఉన్న వ్యక్తికి కాల్ చేసి వివరాలు చెప్తాడు. దాంతో లోపలికి పంపించమని చెప్పడంతో ఆమెను లోపలికి పంపిస్తారు.
అదంతా చూస్తున్న వరూధినికి లోపల ఏదో చిన్న టెన్షన్ మొదలవుతుంది. అయినా ఎందుకు భయపడాలి ఇది నా డ్యూటీ అని మనసుకి సర్ది చెప్పుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది.
గేటు దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి నడవడానికి తనకు ఐదు నిమిషాలు పడుతుంది. చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ, “ఇంత పెద్దగా ఉంది ఈ మెన్షన్! అచ్చం సినిమాలో లాగా ఉంది” అనుకుంటూ ఉంటుంది.
ఇంతలో ఒక మేల్ సిబ్బంది వచ్చి డోర్ తీస్తాడు.
వరూధినిని చూసి షాక్ అయి, “ఎవరు కావాలి మేడం?” అని అడుగుతాడు.
“నేను డాక్టర్ని. పేషెంట్‌ని చెక్ చేయడానికి వచ్చాను. ఈరోజు డ్యూటీ డాక్టర్ రాలేదు. అందుకనే తన ప్లేస్‌లో నేను వచ్చాను” అని చెప్తుంది.
దాంతో ఆ వ్యక్తి లోపలికి వెళ్లి విషయం చెప్తాడు. పంపించమని చెప్పడంతో వరూధిని లోపలికి అడుగుపెడుతుంది.
రాజసం ఉట్టిపడేలాగా ఉండే ఆ మెన్షన్‌ని చూస్తుంటే తనకి చాలా భయంగా ఉంటుంది. ఇంట్లో మేల్ సిబ్బంది. తప్ప ఒక్క లేడీ కూడా కనిపించకపోవడంతో వరూధినికి కొంచెం వింతగా అనిపిస్తుంది.
ఆ వ్యక్తి తనని ఒక రూమ్ ముందుకి తీసుకెళ్తాడు.
“ఇందులోనే ఉన్నారు సార్. మీరు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయండి మేడం. నేను ఇప్పుడే వస్తాను” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
భయంగానే డోర్ హ్యాండిల్ పట్టుకుని ముందుకి తోస్తుంది. లోపల అచ్చం హాస్పిటల్‌లో ఐసీయూ సెటప్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అది చూస్తూనే లోపలికి వెళ్తుంది.
మంచం మీద 55 సంవత్సరాల రఘునందన్ సింహ గారు పడుకుని ఉంటారు.
ఆయన ఫైల్ తీసుకుని డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది.
ఇంతలో వెనుక నుంచి ఒక 70 ఏళ్ల పెద్దాయన లోపలికి వస్తాడు.
“నువ్వు ఎవరమ్మా?” అని అడగగానే వరూధిని ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది.
ఆ పెద్దాయన మళ్లీ, “నువ్వు ఎవరు?” అని అడగగానే,
“ఈరోజు వచ్చే డ్యూటీ డాక్టర్ రాలేదండి. ఆయన ప్లేస్‌లో నేను వచ్చాను. నా పేరు వరూధిని” అని సమాధానం ఇస్తుంది.
“ఓ అలాగా! సరే సరే. ఏమైనా కావాలా అమ్మా?” అని అడగగానే,
“ఆ… వద్దండి” అంటూ తను వచ్చిన పని చేసుకుంటూ ఉంటుంది.
పేషెంట్‌కి కాళ్లు, చేతులకు ఎక్సర్‌సైజ్ చేయిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పెద్దాయనకు వరూధిని బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది.
కొద్దిసేపు గమనించిన ఆ పెద్దాయన, “అమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్? ఇంతకుముందు నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను” అనగానే,
వరూధిని, “పేషెంట్‌తో మాట్లాడుతున్నానండి” అంటుంది.
“వాడికి వినబడదమ్మా!” అనగానే,
“లేదు సార్. ఆయన అన్నీ వింటారు. ఆయనతో ఇలా మాట్లాడుతూ ఉంటేనే ఆయన తొందరగా కోలుకుంటారు” అని చెప్పడంతో ఆ పెద్దాయన ఆశ్చర్యపోతాడు.
అలా మాట్లాడుతూ ట్రీట్‌మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తుంది.
“నేను వెళ్ళొస్తాను సార్. రేపటి నుంచి ఎప్పటిలాగే మీకు రోజూ వచ్చే డాక్టరే ట్రీట్‌మెంట్ చేస్తారు. ఈరోజు ఆయన రానందువల్ల నేను రావాల్సి వచ్చింది” అని చెప్పి బయటికి వెళ్లిపోతుంది.
ఆ పెద్దాయన రఘునందన్ గారి దగ్గర కూర్చొని, “నిజంగా నీకు వినిపిస్తుందా రఘు?” అని అడుగుతాడు.
అప్పుడే రఘునందన్ గారి కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి.
దాంతో ఆ పెద్దాయన పక్కనే ఉన్న టిష్యూ తీసి ఆయన కన్నీళ్లు తుడుస్తాడు.
“రఘు! ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది రా. మొదటిసారి నువ్వు నా మాటలకి స్పందిస్తున్నావు. ఈ అమ్మాయి చేతిలో ఏదో మాయ ఉంది” అనుకుంటూ ఉంటాడు.
ఇంతలో సడన్‌గా ఏదో గుర్తుకు వచ్చినవాడిలా మళ్లీ నిరాశ చెందుతూ ఉంటాడు ఆ పెద్దాయన.
వరూధిని బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్‌కి బయలుదేరుతుంది.
హాస్పిటల్‌కి వచ్చిన వరూధిని దగ్గరికి వైష్ణవి వచ్చి, “ఎలా జరిగింది ట్రీట్‌మెంట్?” అని అడుగుతుంది.
“మామూలుగానే జరిగింది. అనవసరంగా టెన్షన్ పెట్టి చంపేసావు నువ్వు. నువ్వు చెప్పేంత అక్కడ ఏమీ లేదు” అని వరూధిని సమాధానం ఇస్తుంది.
ఆరోజు అలా 4:30 వరకు డ్యూటీ చేసి, రిక్కీని స్కూల్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి స్కూల్‌కి వెళ్తుంది వరూధిని.
స్కూల్ ముందు స్కూటీ ఆపి లోపలికి వెళ్తుంది.
రిక్కీ క్లాస్‌రూమ్‌లో కనిపించడు. దాంతో కంగారుపడిన వరూధిని క్లాస్ టీచర్‌ని అడుగుతుంది.
దాంతో టీచర్, “ప్రిన్సిపల్ రూమ్‌లో ఉన్నారు మేడం. ఆవిడ మీకోసమే వెయిట్ చేస్తున్నారు” అని చెప్తుంది.
రిక్కీకి ఏమైందో అని టెన్షన్ పడుతూ ప్రిన్సిపల్ రూమ్‌కి వెళ్తుంది.
రిక్కీ అక్కడ కూర్చొని, గుర్రుగా పక్కన కూర్చున్న అబ్బాయిని చూస్తూ ఉంటాడు. ఇద్దరి బట్టలు మాసిపోయి, జుట్టంతా చెరిగిపోయి, అక్కడక్కడ దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి.
రిక్కీ దగ్గరికి వెళ్లి వరూధిని, “ఏమైంది రిక్కీ? ఈ దెబ్బలేంటి?” అని అడుగుతుండగా,
ప్రిన్సిపల్, “మీరు ఇలా కూర్చోండి మేడం. నేను చెప్తాను” అంటుంది.
To be connected
Swipe left/right or tap the sides to turn pages