:: ఎడవ భాగం ::
కాలేజ్ క్యాంటీన్ పొడవుగా ఉంది! మధ్యాహ్నం మూడున్నర సమయం అది!
పరీక్షలు పూర్తవడంతో క్యాంటీన్ మొత్తం స్టూడెంట్స్ తో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా నవ్వులు, అరుపులు, ప్లేట్లు తగులుతున్న శబ్దాలు, టీ కప్పుల గలగలలు!
ఒక మూలన ఉన్న పెద్ద టేబుల్ దగ్గర ధృవ్, సంజయ్, వంశీ, తేజ, అఖిల్, మేఘన, మోక్ష కూర్చున్నారు. అప్పుడే వారి దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు!
“ ఏంటి అన్నా! ఎగ్జాం అయిపోయింది కదా! ఏం తీసుకురమ్మంటారు! “ అడిగాడు అతను!
“ టేబుల్ మీద టీ కప్పులు, సమోసాలు, పఫ్‌లు అయిదు నిమిషాలలో వేడిగా ఉండాలి! “ అంటూ వంశీ అనగానే అక్కడి నుండి వెళ్లి మూడు నిమిషాలలో టేబుల్ పైన ఉంచాడు ఆ అబ్బాయి!