చిత్రగుప్త – 10వ భాగం
ఇంటి బయట బైక్ పైన ఆగిన ధృవ్, బైక్ హారన్ ని పదవ సారి మ్రోగించాడు!
ఆ సౌండ్ వింటూ హ్యాండ్ బ్యాగ్ ని భుజాన వేసుకొని తన గది నుండి బయటకు నడిచింది మోక్ష!
హాల్ లోకి వచ్చిన మోక్ష కి ఎదురుగా తన తల్లి పవిత్ర నిలబడి ఉంది!
“ ఎక్కడికి?” చేతులు కట్టుకొని సిరియాస్ గా అడిగింది పవిత్ర!
“ ఫ్రెండ్ తో! బయటకి!” కాస్త ఇబ్బంది పడుతూ అంది మోక్ష!