:: చిత్రగుప్త – 9వ భాగం ::
రోడ్డుకు ఇరువైపులా పచ్చటి పొలాలు, వర్షపు నీటితో నిండిపోయిన చిన్న చిన్న గుంటలు, అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న బస్సులను దాటుకొని ఒక చెట్టు క్రింద బైక్ ని ఆపాడు ధృవ్! వెనక కూర్చున్న మోక్ష క్రిందకు దిగి నిలబడింది!
అప్పుడే ఆ చెట్టు ప్రక్కనే ఉన్న ఇంటి లోపల నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు ఒకతను! అతని పేరు చంద్రశేఖర్! అతనే మోక్ష వాళ్ళ నాన్న!
“ హాయ్ అంకుల్! “ అతనిని చూస్తూ పలకరించాడు ధృవ్!
“ హా ధృవ్! ఎగ్జాం ఎలా రాసావు! “
“ కాపీ కొట్టి బాగానే రాసాడులే నాన్నా! “ నవ్వుతూ అంది మోక్ష!
“ ఛ ఛ! ధృవ్ చాలా టాలెంటెడ్ బాయ్! “ అన్నాడు చంద్రశేఖర్!
“ అవును! చలానే టాలెంటెడ్! “ నవ్వి ఇంట్లోకి వెళ్లిపోయింది మోక్ష!
“ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! ఏం ప్లాన్స్ లేవా ఇవాళ ? “ అడిగాడు చంద్రశేఖర్!
“ అదెలాగో ఉండేదే కదా అంకుల్! చుట్టాలు వచ్చారంట! ఇంటికి వెళ్లి పలకరించాలి ముందు! సరే అంకుల్! నేను వెళతాను! “
“ అవునా! సరే సరే! “ అంటూ చంద్రశేఖర్ అనగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధృవ్!
ఇరవై నిమిషాల తర్వాత ధృవ్ బైక్ ఒక చిన్న, అందమైన ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి ముంగిట్లో తులసి కోట, పక్కనే పూల మొక్కలు, చూడగానే ఆ ఇంట్లో ప్రశాంతత కనిపిస్తోంది.