New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
చివరి ప్రయాణికురాలు – 1

చివరి ప్రయాణికురాలు – 1

ఒక చిన్న భయానక కథ

 

 

రాత్రి సమయం 12:40.

హైదరాబాద్ నుంచి ఓ పల్లెటూరికి వెళ్లే చివరి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది…

 

 

బస్సులో డ్రైవర్, కండక్టర్ కాకుండా కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు…

 

 

 

కానీ అప్పుడే ఒక యువతి బస్సు ఆపండి అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కింది…

 

 

తెల్లటి చీర, నుదుటిపై చిన్న బొట్టు, తడిసిన జుట్టు.

ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన.. భయం కనిపిస్తున్నాయి..

 

 

“అమ్మా… ఎక్కడికి వెళ్లాలి?” అని అడిగాడు కండక్టర్…

 

 

 ఆ యువతి కంగారుగా “మల్లెపల్లి.” అని 

ఆమె చెప్పిన ఊరి పేరు వినగానే కండక్టర్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు…

 

 

 

“మల్లెపల్లా?”

 

 

“అవును.”

 

 

 

“అక్కడికి ఈ సమయంలో బస్సులు వెళ్లవమ్మా. అయినా ఇది చివరి బస్సు. ఎక్కు.”

ఆమె వెనుక సీట్లో కూర్చుంది…

 

 

 

బస్సు బయలుదేరింది.

కొంతసేపటికి…

 

 

“అన్నా… బస్సు ఆపండి.”

 

 

అని ఆమె గొంతు వినిపించడంతో డ్రైవర్ అద్దంలోకి చూశాడు…

 

 

“ఏమైంది అమ్మా?”

 

 

“నా పక్కన ఎవరో కూర్చున్నట్టుగా ఉంది.”

 

 

కండక్టర్ నవ్వాడు…

 

 

“అక్కడ ఎవరూ లేరమ్మా.”

 

 

ఆమె మాత్రం భయంగా తన పక్కనున్న ఖాళీ సీటును చూస్తూ ఉంది…

 

 

 

మరో పది నిమిషాలకు…

 

 

“అన్నా… మళ్లీ బస్సు ఆపండి.”

 

 

ఈసారి డ్రైవర్ చిరాకుగా బస్సు ఆపాడు…

 

 

“ఏమైంది?”

 

 

ఆమె వణుకుతున్న గొంతుతో అడిగింది…

 

 

“నా పక్కన కూర్చున్న వ్యక్తి… 

 

ఇప్పుడు నా చెయ్యి పట్టుకున్నాడు.”

 

 

డ్రైవర్, కండక్టర్ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు…

 

 

 

కండక్టర్ ఆమె దగ్గరకు వెళ్లి పక్క సీటును పరిశీలించాడు…

 

 

ఖాళీగానే ఉంది…

 

 

 

“అమ్మా, నీకు ఆరోగ్యం బాగానే ఉందా?”..

 

 

 

ఆమె సమాధానం చెప్పలేదు…

 

 

కానీ ఆమె చేతిని మాత్రం ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా వేళ్లపై ఎర్రటి గుర్తులు ఏర్పడ్డాయి.

కండక్టర్ భయపడ్డాడు…

 

 

 

వెంటనే డ్రైవర్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా అన్నాడు..

 

 

“అన్నా… ఈ అమ్మాయిని మల్లెపల్లిలో దించేసి త్వరగా వచ్చేద్దాం.”..

 

 

 

బస్సు మళ్లీ ముందుకు కదిలింది…

 

 

 

సరిగ్గా 1:30కి మల్లెపల్లి వచ్చింది. బస్సు

 

 

“అమ్మా… నీ ఊరు వచ్చేసింది. దిగు.”..

 

 

 

ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది…

 

 

దిగేముందు కండక్టర్ వైపు తిరిగి చిన్నగా నవ్వింది…

 

 

 

“అన్నా… ఇంత దూరం నాతో వచ్చినందుకు ధన్యవాదాలు.”..

 

 

అతను తల ఊపాడు…

 

 

ఆమె బస్సు దిగిపోయింది…

 

 

బస్సు ముందుకు కదిలింది.

కానీ కేవలం రెండు నిమిషాల తర్వాత డ్రైవర్ ఫోన్ మోగింది…

 

 

అది డిపో మేనేజర్ నుంచి.

“ఏరా! బస్సు ఇంకా ఎక్కడుంది?”…

 

 

“మల్లెపల్లి దాటామండి.”..

 

 

“ఏంటి? మల్లెపల్లా? అక్కడికి బస్సు ఎందుకు తీసుకెళ్లావు?”..

 

 

 

“అక్కడ ఒక అమ్మాయిని దింపాను సార్.”..

 

 

అవతలి వ్యక్తి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు…

 

 

తర్వాత వణుకుతున్న గొంతుతో అడిగాడు…

 

 

 

“ఆ అమ్మాయి… తెల్ల చీర కట్టుకుందా?”..

 

 

 అని వాళ్ళ సార్ అడిగిన మాటకి డ్రైవర్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది…

 

 

“అవును సార్. మీకెలా తెలుసు?”…

 

 

 

“ఆమె పేరు తెలుసా నీకు?”

“తెలీదు సార్.”…

 

 

 

“ఆమె పేరు మాధవి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు, ఇదే సమయానికి మీ బస్సు కింద పడి చనిపోయింది.”..

 

 

 

డ్రైవర్ చేతులు వణికిపోయాయి.

“సార్… మీరు ఏం మాట్లాడుతున్నారు?”…

 

 

 

“ఆమె చనిపోయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున చివరి బస్సులో కనిపిస్తుందని… చెబుతుంటారు…

 

 

 

కానీ ఇప్పటివరకు ఎవరికీ ఆమెతో మాట్లాడే ధైర్యం రాలేదు.”…

 

 

 

డ్రైవర్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు.

బస్సులో కండక్టర్ లేడు…

 

 

 

మిగిలిన ప్రయాణికులు కూడా లేరు.

కేవలం చివరి సీటులో ఒక చిన్న కాగితం కనిపించింది…

 

 

 

అతను వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకున్నాడు…

 

 

 

అందులో ఇలా రాసి ఉంది…

 

 

 

“అన్నా… నన్ను నా ఇంటి దగ్గర దింపినందుకు ధన్యవాదాలు…

 

 

కానీ నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే బాగుండేది…

 

 

ఎందుకంటే నేను దిగింది నా ఇంటి దగ్గర కాదు…”

 

అంతే…

డ్రైవర్ కళ్లలో భయం నిండిపోయింది…

 

 

 

ఆ కాగితం కింద మరో వాక్యం ఉంది…

 

 

 

“నేను చనిపోయిన చోటే నువ్వు నన్ను దింపావు…

 

 

ఇప్పుడు నీ పక్కన కూర్చున్నది ఎవరో తెలుసా?”…

 

 

 

 అని ఆమె అడిగిన దానికి…

 

 

అతను నెమ్మదిగా పక్క సీటు వైపు చూశాడు.

అక్కడ కండక్టర్ కూర్చుని ఉన్నాడు…

 

 

 

కానీ…

 

 

అతని ముఖం కనిపించడం లేదు.

ఎందుకంటే అతని తల డ్రైవర్ భుజం మీద వాలిపోయి ఉంది…

 

 

 

మెడ వెనక్కి తిరిగి ఉంది.

అప్పుడే అతని చెవిలో ఓ గొంతు వినిపించింది…

 

 

 

“అన్నా… నన్ను ఒంటరిగా పంపించడానికి మనసొప్పక నా వెంట వచ్చావా?”…

 

 

 

మరుసటి రోజు ఉదయం ఆ బస్సు రోడ్డుపక్కన చెట్టును ఢీకొని కనిపించింది…

 

 

 

డ్రైవర్ మాత్రమే బతికి ఉన్నాడు.

కానీ అతనికి మాటలు రావడం లేదు…

 

 

 

 హాస్పటల్లో డాక్టర్ అతనికి స్పృహ వచ్చాక ఒక ప్రశ్న అడిగాడు…

 

 

 

“నీతో పాటు వచ్చిన కండక్టర్ ఎక్కడ?”…

 

 

డ్రైవర్ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాడు.

“నేను డ్రైవర్‌ని కాదు సార్…”

 

 

“మరి?”

 

 

అతను కన్నీళ్లతో సమాధానం చెప్పాడు.

“నేను ఆ బస్సులో చివరి ప్రయాణికుడిని!”

🩸 శుభం.