New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల 🔥 – 10
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 10

అయినా క్రిష్ బ్యాచ్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి దీర్ఘంగా నిట్టూరుస్తూ అయినా నాకు తెలియక అడుగుతున్నానురా అసలు ఒక ఆడదాని లో మీరు తాకనిది అంటూ ఏముందిరా?

 

మీ చిన్నప్పుడు మీరు మీ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడే పట్టుకుని ఆడుకుంటారు కదరా అమ్మ స్థన్యాలతో ఇక్కడ మా దగ్గర కూడా అవే కదరా ఉంటాయి..

 

అమ్మ మిమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకుని గోరు ముద్దలు తినిపించేటప్పుడు ఆమె చెంపలు ముద్దాడుతూనే ఉంటారు కదరా…ఇక్కడ మా దగ్గర కూడా అవే చెంపలు కదరా ఉండేది…

 

మీకు నిద్ర వస్తున్నప్పుడు అమ్మ మిమ్మల్ని తన ఒళ్ళో పడుకోపెట్టుకుని జో కొడుతుంటే ఆమె నడుము పట్టుకుని హాయిగా ఆదమరచి నిద్రపోతారే ….ఇక్కడ మా దగ్గర కూడా అదే నడుము కదరా ఉండేది…

 

మీరు అమ్మ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడే తాకేసినవే కదరా మా దగ్గర కూడా ఉండేది…అంతకుమించి ఇంకా ఏమున్నాయ్ రా ఆడదానిలో మీరు చూడడానికి, తాకడానికి అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మీకు కలిగే అయిదు, పది నిముషాల సుఖం కోసం మృగాల కంటే హీనంగా దిగజారి పోయారు కదరా..

 

 అమాయకపు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు కదరా “తు” మీ బతుకులు అంటూ వాళ్ళ మొహన ఉమ్ముతూ మీవి ఒక బతుకులేనా అని ఎంతో కోపంగా చూస్తూ మగతనం అంటే బలవంతంగా మృగాల్లల మారి ఆడవాళ్ళని అనుభవించడం కాదురా..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue