మీరు కంగారు పడకండి కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుంది అంటూ నోటికి వచ్చిన అబద్దం చెప్పి వాళ్ళని మాయ చేసి మీరెళ్ళి ఫ్రెష్ అయి రండి నేను టిఫిన్ చేస్తా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది….
కిచెన్ లోకి వెళ్లి హ్మ్ కొంచెం నా మొహం పీక్కుపోయి కళ్ళు ఎర్రపడినందుకే ఇంతలా కంగారు పడిపోతున్నారే… మీకు మీ కూతురు జీవితం నాశనం అయ్యిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అస్సలు తెలియనివ్వను…
మీకు ఎలాంటి అనుమానం రానివ్వకుండా ఇంకాస్త జాగ్రత్త పడతాను అనుకుంటూ లోపల బాధగా ఉన్న సరే అమ్మ, నాన్నల కోసం నవ్వు నటిస్తూ టిఫిన్ ప్రిపేర్చే సేసి వాళ్ళతో కలిసి ఏదో తిన్న అంటే తిన్న అన్నట్టు కొంచెం తింటుంది..
తరువాత రెడీ అవడానికి తన రూం కి వెళ్లి రెడీ అయి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంటే దాని పక్కనే ఉన్న ఫోన్ కనిపిస్తుంది..ఆ ఫోన్ చూసిన జ్వాల కళ్ళు కోపంతో చింతనిప్పుల్లా మారిపోయాయి..
అది ఆ వెధవల్లో ఒకడి ఫోన్.. నైట్ పోలీస్ హారన్ సౌండ్ విని పరిగెట్టేటపుడు మర్చిపోయి వెళ్లిన ఫోన్ ఆమె ఇంటికి వచ్చేటపుడు అక్కడ కనిపిస్తే తన ఇంటికి తీసుకొచ్చింది..
ఆ ఫోన్ లో రికార్డు అయిన వీడియో చూసిన జ్వాల కంట్లో నీళ్ళు, కళ్ళల్లో కోపం, బాధ అన్నీ వచ్చి చేరాయి..