జ్వాల వెళ్ళిపోయిన తర్వాత శక్తి తీవ్రమైన ఆవేదనకు గురయ్యాడు. ఆమెను కోల్పోవడం అంటే తన ప్రాణాన్ని కోల్పోవడమే అని అతనికి అర్థమైంది.
“శక్తి! ఏంటి ఆ అమ్మాయితో తిరగడం? మన ఆస్తి చూసి ఆ అమ్మాయి నీ వెనుక పడి నిన్ను తన బుట్టలో వేసుకుంది. అసలు తను ఎవరో తెలుసా మన కంపెనీ లో పని చేసే ఒక గుమస్తా కూతురు, అటువంటి అమ్మాయి మన ఇంటికి కోడలిగా రావడానికి ఎలాంటి అర్హత లేదు.
నీ పెళ్లి ఒక పెద్ద మినిస్టర్ కూతురితో నిశ్చయించబోతున్నాను. ఆ అమ్మాయిని మర్చిపో, లేదు మర్చిపోలేను అంటావా ఉంచుకో అంతే కానీ తనని నువ్వు పెళ్ళి చేసుకోవడానికి నేను చచ్చిన ఒప్పుకోను అని రాజశేఖర్ చాలా కఠినంగా చెప్పారు.
శక్తి తన తండ్రి కళ్లల్లోకి కోపం గా సూటిగా చూశాడు. చూడు నాన్న నువ్వు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఇంకా ఏంటి మీరు అన్నది మనకి ఉన్న ఆస్తి చూసి నన్ను తన వెనుక తిప్పుకుందా. మీకు తెలుసో లేదో నా వెనుక ఆస్తి ఉంది అనే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీరు అన్నారే ఆస్తి కోసం అని, ఆస్తి కోసం చేసుకునే వాళ్లే మీరు చూసిన మినిస్టర్ సంబంధం .ఇప్పటికిప్పుడు మీరు వాళ్ళకి కాల్ చేసి నా ఆస్తి నా చిన్న కొడుక్కి ఒక్క పైసా వాటా ఇవ్వను అని చెప్పండి. వెంటనే వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది.