New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 6

జ్వాల W/O శక్తి – 6

చిన్న చిన్న షాప్ లకు వెళ్ళి, అందరిని ఎంతో ప్రేమగా అన్నయ్య మా వారు శక్తి . ఆయన ఈ దేశం కోసం, పర్యావరణం కోసం ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పెద్ద కంపెనీలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న మెటీరియల్స్ మాకు ఇచ్చి సహాయం చేయండి. మీ రుణం ఉంచుకోం” అని చేతులు జోడించి అడిగింది.

ఆమె నిరాడంబరతను, కళ్లల్లోని ఆరాటాన్ని చూసి ఆ చిన్న చిన్న కార్మికులందరూ కదిలిపోయారు. 

 

 

నువ్వు  అన్నయ్య అని పిలిచి..మా చెల్లెవి అయ్యావు అమ్మ,  బావ కోసం   మేము నిలబడతాం” అంటూ రాజశేఖర్ బెదిరింపులను లెక్కచేయకుండా, రాత్రికి రాత్రే వందల మంది కార్మికులు తమ దగ్గర ఉన్న మెటీరియల్స్‌ను ఉచితంగా ‘జేఎస్’ ఆఫీస్‌కు చేర్చారు. శక్తి ఆశ్చర్యపోయాడు. జ్వాల తెచ్చిన ఆ మెటీరియల్స్‌తో రోజంతా నిద్ర లేకుండా పనిచేసి అద్భుతమైన ప్రాజెక్ట్ మోడల్‌ను సిద్ధం చేశాడు.

 

టెండర్ ప్రజెంటేషన్ రోజున, ఢిల్లీ నుండి వచ్చిన హైలెవెల్ కమిటీ ముందు శక్తి తన ప్రజెంటేషన్ ఇచ్చాడు. రాజశేఖర్ ప్లాన్ కేవలం లాభాల కోసం ఉంటే, శక్తి ప్లాన్ దేశంలోని పేద ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందించేలా ఉంది. కమిటీ సభ్యులు శక్తి మేధస్సుకు, జ్వాల సేకరించిన క్షేత్రస్థాయి డాక్యుమెంట్‌లకు ఫిదా అయిపోయారు. ఆర్ఎస్ గ్రూప్‌ను వెనక్కి నెట్టి, ఐదు వందల కోట్ల మెగా ప్రాజెక్ట్‌ను ‘జేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ కైవసం చేసుకుంది. జ్వాల, శక్తిల ఆత్మగౌరవ పోరాటం మహా విజయాన్ని సాధించింది.

 

టెండర్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ఉదయం, రాజశేఖర్ తన పెంట్ హౌస్‌లో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. మీడియాలో ప్రతీ ఛానల్‌లోనూ ‘జేఎస్ గ్రూప్’ సాధించిన సంచలన విజయం గురించే వార్తలు వస్తున్నాయి. తన కొడుకు తన సహాయం లేకుండా, కేవలం తన ప్రతిభతో తననే ఓడించే స్థాయికి ఎదిగాడని ఆయనకు అర్థమైంది. తన అహంకారం ముక్కలైపోయింది.

అదే సమయంలో, ఆఫీస్ తలుపులు తెరుచుకున్నాయి. శక్తి మరియు జ్వాల ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. శక్తి చేతిలో ఆ ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ప్రాజెక్ట్ ఆర్డర్ కాపీ ఉంది. ఇద్దరూ రాజశేఖర్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళారు.

 

శక్తి ఆ పేపర్లను రాజశేఖర్ కాళ్ల ముందు ఉంచాడు. జ్వాల చేయి పట్టుకుని, ఇద్దరూ కలిసి రాజశేఖర్ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. శక్తి పైకి లేచి, “నాన్న… నేను గెలిచాను. నా మాట నిలబెట్టుకున్నాను. కానీ ఈ గెలుపు మిమ్మల్ని అవమానించడానికి కాదు. నా ప్రేమ ఎంత పవిత్రమైనదో, నా జ్వాల ఎంత గొప్పదో మీకు చూపించడానికే. ఈ రోజు నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించగలిగానంటే దానికి కారణం జ్వాల నాకు ఇచ్చిన భరోసా. పెద్ద కంపెనీలు నన్ను నమ్మనప్పుడు, ఆమె నా పక్కన నిలబడింది. ఇప్పుడు మీ కొడుకుగా మీ ఆశీర్వాదం అడగడానికి వచ్చాను” అన్నాడు ఎంతో గంభీరంగా.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue