New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ మనసు నాకు తెలుసు – 4

నీ మనసు నాకు తెలుసు – 4

నీ మనసు నాకు తెలుసు -4

 

 

ఇంటర్వ్యూ అయ్యాక… సీత ఆటో లో వెళ్తూ చాలా హ్యాపీ గా ఉంటుంది….

 

ఇంటికి వెళ్ళక….

 

 

సరోజ: ఏమే, సీత… ఉద్యోగం వచ్చింది ఆ??? లేక, కంపెనీ నుండి గెంటేశారు ఆ???

 

 

సీత: వచ్చింది, పిన్ని…

 

 

రవీంద్ర: ఇంకేం అయితే,,, రోజు నేను డ్రాప్ చేసి పిక్ చేసుకుంటా… ఏం అంటావు సీత?? ఇంకా ఎలాగో జాబ్ ఉంది కదా..!! పెళ్లి కూడా చేసుకుందామా??

 

 

సీత: లేదు,,, నాకు కొన్ని డేస్ టైమ్ కావాలి… నేను జాబ్ మీద కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్న….. అండ్ ఇంకో విషయం నువ్వు తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు… ఆఫీస్ క్యాబ్ వస్తుంది…..

 

 

సరోజ: ఏంటి? ఉద్యోగం వచ్చిందని ఇప్పుడు పెళ్లి వద్దంటున్నావా? ఉద్యోగం రాగానే అంత పొగరు వచ్చేసిందా?

 

 

సీత: అలా, ఏం లేదు పిన్ని… కొన్ని డేస్ టైమ్ ఇవ్వండి.. చేసుకుంటా.. అని చెప్తున్న కదా..!!!

 

 

 

సీత రూమ్ లోకి వేసుకొని…. మంచం మీద పడుకొని…. ఉద్యోగం అయితే వచ్చింది… మరి, ఆ పెళ్ళి ఎలా తప్పించుకోవాలి..?? ఏం చేయాలి..?? దివ్య నీ ఐడియా అడుగుదాం అనుకొని ఫోన్ ఓపెన్ చేస్తుంది…

 

 

అప్పుడు ఏ సీత ఫోన్ కి తెలియని నంబర్ నుండి మెసేజ్ వస్తుంది…. మెసేజ్ ఓపెన్ చేస్తుంది…

 

 

హేయ్, వస పిట్ట ఏం చేస్తున్నావ్?? ఇందాక ఏదో కోపం లో ఫైల్ విసిరి కొట్ట… ఏం అనుకోకు… అండ్ ఆఫీస్ కి 10 లోపు రా… లేకపోతే పనిష్మెంట్ అని మెసేజ్ పెడతాడు దేవా సీతకి….

 

 

సీత మనసులో అసలు ఆయన ఏం అనుకుంటున్నాడు నా గురించి… సారీ, అయిన చెప్పలేదు… ఆఫీస్‌కి వెళ్తున్నానా… లేక స్కూల్‌కి వెళ్తున్నానా? మొదటి రోజుకే పనిష్మెంట్ అంటున్నారు!

 

 

……………………………………………….

 

 

వంశీ: ఏరా దేవా?? సీతకి ఏ నా మెసేజ్??

 

దేవా: అవును రా…. ఏం చేయకూడదా??

 

వంశీ: అబ్బో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ?? ఏంటి?? 

 

దేవా: ఎక్కువ చేశావు అనుకో…. రేపు ఆఫీస్ లో వాష్రూమ్ కడిగిస్తా నీతో చూస్కో!!! అయిన రేపు ఆఫీస్ కి 10 లోపు రమ్మని మెసేజ్ పెట్ట అంతే….. లవ్ లేదు,, బొంగు లేదు…

 

 

వంశీ: మార్నింగ్ ఎక్కడ వెళ్ళవు రా???

 

దేవా: ఆ స్నేహ కాల్ చేసింది… లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పా… ఇంకోసారి నా జోలికి రాకు అని… 

 

వంశీ: కొట్టావు కదా… నిజం చెప్పు….

 

దేవా: మరి ఆ స్నేహ గురించి నీకు తెలీదు ఆ?? అది ఎలాంటిది అని??

 

వంశీ: మరి, మీ ఇంట్లో ఆ స్నేహనీ నీకు పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నారు కదా రా…

 

దేవా: అందుకు ఏ కదా రా… నీతో ఉంటుంది నీ ఫ్లాట్ లో.. ఇంట్లో ఉంటే అమ్మ, నాన్న అందరూ అదే పంచాయతీ పెడతారు… నాకు ఇంటికి వెళ్లాలి అని కూడా లేదు… స్నేహ గురించి నిజం చెప్దామా అంటే… ఎంత అయినా మా నాన్న కి ఫ్రెండ్ కూతురు కదా… ఇంట్లో ఎవరు నమ్మరు కూడా… చెప్పి టైమ్ వేస్ట్… ఏం అయిన అంటే… ఏదో అసలు… స్నేహ తప్పు ఏ లేదు అన్నట్టు మొత్తం తప్పు నాదే అనట్టు ఎప్పుడూ నేను ఏ తనని అర్థం చేసుకోడం లేదు… నేను ఏ కొడుతున్న అనట్టు నా మీద ఏ నింద వేస్తున్నారు…

 

 

వంశీ: ఎన్ని రోజులు రా ఇలా…. ఏదో ఒకటి చేయాలి కదా… 

 

 

దేవా: ఏమో, వంశీ… నాకు కూడా తెలియదు… ఏం చేయాలి అని నాకు అర్థం కావడం లేదు…. 

 

 

వంశీ: మరి,, సీత నిన్ను అన్ని మాటలు అన్న…. ఎందుకు రా ఏం అనలేదు… జస్ట్ కోపం గా అరిచి వదిలేశావు…

 

 

దేవా: ఓహ్… అదా! ఇంతవరకు ఎవరూ నాతో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు రా. నా డబ్బు, ఆస్తి, కంపెనీలు చూసే అందరూ నాతో స్నేహం చేశారు. అంతేకానీ, నన్ను ఒక సాధారణ మనిషిలా చూసిన వాళ్లు చాలా తక్కువ. పైకి ఒకలా మాట్లాడుతూ, లోపల ఇంకోలా ఆలోచించే వాళ్లనే ఎక్కువగా చూశాను.కానీ, సీత మాత్రం అలా కాదు. నేను ఎవరో తెలియకపోయినా, నా భుజం తట్టి ‘ఏమైనా సహాయం కావాలంటే అడుగు’ అంది. ఆ మాట విన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. తన కళ్లలో ఏదో తెలియని బాధ ఉన్నా, అందరినీ తన వాళ్లలా చూసే గుణం తనలో ఉంది రా…

 

 

వంశీ: “దీన్ని ప్రేమ అంటారేమో రా…?”

 

దేవా వంశీ వైపు కోపంగా చూసి…

“ఒరేయ్, నీకు ఇంకో పని లేదా రా? ప్రేమా, గీమా అని ఏవేవో ఊహించుకోకు. అది అలాంటిదేమీ కాదు. నన్ను మనిషిగా చూసి మాట్లాడిన వాళ్లు చాలా తక్కువ.

కానీ, ఆ సీత మాత్రం వేరే. నేను ఒక్క మాట మాట్లాడకపోయినా, తనే వాగుతూనే ఉంది. ఒక వసపిట్టలా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. ఎదుటి వ్యక్తి ఎవరు, ఏంటి అని కూడా ఆలోచించదు. అందరినీ తన వాళ్లలాగే అనుకుంటుంది.

 

 

కానీ, దాని అర్థం నేను తన గురించి ఏదో ఫీల్ అవుతున్నాను అని కాదు. రేపటి నుంచి తన పని ఎలా ఉంటుందో చూస్తా. పని చేయకుండా, మాటలతోనే కాలం గడిపితే మాత్రం నా దగ్గర కుదరదు. ఎంత మంచిదైనా, ఎంత అమాయకురాలైనా… కంపెనీ రూల్స్ అందరికీ ఒకటే. పని సరిగా చేయకపోతే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఉద్యోగం నుంచి తీసేస్తా…”అని చెప్పి, చేతిలో ఉన్న ఫైల్‌ని టేబుల్‌పై గట్టిగా పడేశాడు దేవా.

 

 

అది చూసి వంశీ చిన్నగా నవ్వుకుంటూ…

“అయ్యో! కోపం చూస్తుంటే ప్రేమ మొదలైనట్టే ఉంది రా…” అన్నాడు.

 

 

To be continued….

 

 

Don’t forget to leave a comment……