అలా ఆ స్టేట్ మొత్తం అరవింద్ గురించే వస్తుంది టీవీ లో కాని ఇంక అరవింద్కి మాత్రం ఈ విషయాలు ఏమి తెలియవు అరవింద్ మాత్రం ఎక్కడో ఒక చోట ఎదో గోడౌన్ లాంటి దానిలో ఉంటాడు….
అందులో ఒకడిని కుర్చీకి కట్టేసి ఉంచుతారు అతన్ని కొడుతూ ఉంటాడు అరవింద్…. అతనికి మాత్రం ఓపిక అంత ఐపోయి ఎందుకు రా ఇలా మూడు నెలలు నుంచి రోజు వచ్చి నరకం చూపించి చిత్ర వద చేసే బదులు ఒక్కసారే చంపచ్చు కదా అని ఒక్కొక్క పదాన్ని కూడ బలుక్కొని కష్టం గా మాట్లాడుతూ ఉంటాడు….
అరవింద్ రేయ్ నిన్ను ఒక్కసారిగా చంపేస్తే ఎలారా నా బాధ తీరేది హర్ష అని అంటాడు… రేయ్ ఆ రోజు ఎదో తెలియక చేశాను రా మత్తులో అలా ఐపోయింది అంతే కాని గ్రీష్మ ని అలా ఎప్పుడు చూడలేదు రా ఆ ఉద్దేశం తో అని బాధ గా అంటూ ఉంటాడు…..
ఇంతలో అరవింద్ ఫోన్ మొగిద్ది అది తీసి చూసి ఇంటి నుంచి అని అర్ధం అయ్యి కాల్ అటెండ్ చేసి చెప్పు అక్క అని అంటాడు…. అటు వైపు నుంచి ప్రణతి రేయ్ అరు అమ్మ కి బాలేదు రా పడిపోయింది రా త్వరగా ఇంటికి రా అమ్మ నిన్నే కలవరిస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ధి…..